అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీ సిఆర్డీఏ) పరిధిలో భూ సమీకరణ పథకంలో సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణం నిమిత్తం ఏపీ సిఆర్డీఏ వారికి భూములను అందజేసిన ఉండవల్లి గ్రామ రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించేందుకు 2025 డిసెంబర్ 10వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు రాయపూడిలోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ – లాటరీ జరిగింది. వీటిలో 11 నివాస ప్లాట్లు కాగా 5 వాణిజ్య ప్లాట్లు, మొత్తంగా 11 మంది రైతులు, భూయజమానులకు ఈ- లాటరీ విధానంలో ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా ప్లాట్లను కేటాయించడం జరిగింది.
ఈ- లాటరీకి హాజరైన రైతులకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసి తర్వాత ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టడం జరిగింది. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు సిఆర్‌డిఏ అధికారులు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎ.జి.చిన్నికృష్ణ గారు మాట్లాడుతూ..ప్లాట్లు పొందిన రైతులకు భౌగోళికంగా వారి ప్లాట్లు ఎక్కడ కేటాయించబడ్డాయో వివరించడానికి ప్రత్యేకంగా జి.ఐ.ఎస్. సిబ్బంది, గ్రామ సర్వేయర్లను నియమించామన్నారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలాంటి రుసుము వసూలు చేయబడదన్నారు. ఈ కార్యక్రమంలో CRDA అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News