అమరావతిలో గ్రామకంఠాల సమస్యకు పరిష్కారం- క్షేత్రస్థాయి సిబ్బందికి కీలక ఆదేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతిలో గ్రామకంఠాల సమస్యను పరిష్కరించేందుకు ఏపీ సిఆర్డిఏ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పని చేస్తోంది. ఇప్పటికే దీనిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా.పొంగూరు నారాయణ, తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ తో త్రిసభ్య కమిటీ ఏర్పడగా..సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవ తేజ ఐ.ఏ.ఎస్. గ్రామకంఠాల సమస్య అధ్యయనం, సత్వర పరిష్కారం కొరకు రాజధాని గ్రామమైన నేలపాడులో ఇటీవల పర్యటించారు.

ఈ నేపథ్యంలో రాజధాని గ్రామాలలో గ్రామకంఠాల సమగ్ర వివరాలు, మినహాయింపులు, ప్రతిపాదనల వివరాలు సేకరించేందుకు బుధవారం రాయపూడిలో సిఆర్డిఏ ప్రధాన కార్యాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ సమావేశ మందిరంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవ తేజ ఐ.ఏ.ఎస్., గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఐ.ఏ.ఎస్, తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజన సింహ, అమరావతిలోని LPS యూనిట్ల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, మండల తహసీల్దార్లు, వారి కార్యాలయ సిబ్బంది, సర్వేయర్లు, రెవిన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామకంఠాల సమగ్ర వివరాల సేకరణలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా పనిచేయాలని అడిషనల్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ సూచించారు. అలాగే ఈ ప్రక్రియకు సంబంధించి సమావేశంలో పాల్గొన్న సిబ్బంది యొక్క సందేహాలను అడిషనల్ కమిషనర్ గారు నివృత్తి చేశారు. సిఆర్డిఏ కార్యాలయం నుంచి అందజేయబడిన మ్యాప్‌లు, వివరాల ఆధారంగా వివరాల సేకరణ, నమోదు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు రాజధాని అమరావతిలో గ్రామకంఠాల సమస్యను పరిష్కరించే కృతనిశ్చయంతో సిఆర్డిఏ పనిచేస్తోందని అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవ తేజ ఐ.ఏ.ఎస్. స్పష్టం చేశారు. అందుకు తగినట్లుగా క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *