అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(APCRDA) ప్రధాన కార్యాలయంలో ప్రపంచ బ్యాంక్(World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) జాయింట్ టెక్నికల్ మిషన్‌లో భాగంగా 6వ రోజు పలు అంశాలపై సెషన్లు జరిగాయి. WB& ADB బృందం నుంచి వరల్డ్ బ్యాంక్ టాస్క్ టీమ్ లీడర్ జెరాల్డ్ ఒలివర్, లీడ్ ఎకనామిస్ట్ డాక్టర్ మార్సిన్ పియాట్‌కోవ్‌స్కీ, సీనియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ స్పెషలిస్ట్ మార్క్ అలెగ్జాండర్ గిబ్లెట్, IFC (ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్), PPP/ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెషలిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ శ్రీమతి హర్షా ఖుబ్చందాని పాల్గొన్నారు.
బుధవారం ఉదయం CRDA ప్రధాన కార్యాలయంలోని ఒకటవ ఫ్లోర్‌లోని సమావేశ మందిరంలో AIUDP ప్రాజెక్టు అమలులో భాగంగా WB& ADB బృందంతో కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్., అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవ తేజ ఐ.ఏ.ఎస్., APCRDA అధికారులు.. రాజధానిలోని పలు ప్రాజెక్టులలో పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(PPP) అమలుపై సెషన్లను నిర్వహించారు. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(AIUDP) అమలులో భాగంగా PPP విధానంపై WB& ADB బృందం, APCRDA అధికారులతో చర్చలు జరిపారు.
ఈ విధానం అమలులో పాటించాల్సిన నిర్దేశిత నిబంధనలు, సమాచారం చేరవేసేందుకు వినియోగించేందుకు నిర్వహించాల్సిన కార్యకలాపాలు, ఈ విధానంలో అమలయ్యే OBC(ఔట్‌లైన్ బిజినెస్ కేస్) తదితర అంశాలపై స్టేక్‌హోల్డర్ కన్సల్టేషన్ ఇతరత్రా కార్యాచరణపై చర్చలు జరిగాయి.
అమరావతి పరిధిలో APCRDA ప్రస్తుతం అమలు చేస్తున్న PPP విధానాలలో అమలయ్యేందుకు సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు, అలాగే ఇతర ప్రాజెక్టుల సమాచారంపై WB& ADB బృందం సమీక్ష నిర్వహించారు.
PPP విధానంలో ప్రాధాన్య ప్రాజెక్టులను ఎంపిక ప్రక్రియ, వాటి ప్రాథమిక పరిశీలనా ప్రమాణాల నిర్ధారణ అంశాలపై చర్చ జరిగింది. అమరావతిలోని వివిధ రంగాలలో తయారు చేయాల్సిన OBC సంబంధిత అంశాలు, తయారీ ప్రక్రియపై WB& ADB బృందంతో విస్తృత చర్చలు జరిగాయి. PPP ప్రోగ్రామ్‌కు సంబంధించి ఇప్పటివరకు గుర్తించిన సవాళ్లు, లోపాలు, సామర్థ్య లోటు, అలాగే PPP ప్రాజెక్టుల గుర్తింపు, వాటిని సిద్ధం చేయడంలో ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయి. APCRDA.. పబ్లిక్ ఫైనాన్సింగ్‌పై మాత్రమే ఆధారపడకుండా కొన్ని కీలక నగరాభివృద్ధి రంగాలైన క్రీడలు, మీడియా సిటీ, మెడికల్ టూరిజం, వాల్యూ చైన్ – వ్యవసాయం, హార్టికల్చర్, పర్యాటకం, వారసత్వ ప్రాంతాలు, కాలుష్యం లేని రంగాలలో(Non-polluting sectors) PPP అవకాశాలపై దృష్టిసారించిందని APCRDA అధికారులు, WB& ADB బృందానికి తెలిపారు.
Prajavartha Online Telugu News