Breaking News

వనిపెంటలో గురు–శిష్య హస్తశిల్ప్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వనిపెంట గ్రామంలో, బ్రాస్ మరియు బెల్ మెటల్ కళలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో ‘గురు–శిష్య హస్తశిల్ప్ ప్ర‌శిక్ష‌ణ కార్యక్రమం’ (GSHPP)ను ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన PAC సభ్యులు డా. పసుపులేటి హరిప్రసాద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ—హస్తకళలు మన సంస్కృతి, వారసత్వానికి ప్రతిరూపమని, వాటి సంరక్షణ ప్రభుత్వం మరియు సమాజం ఇద్దరి బాధ్యత అని పేర్కొన్నారు. హస్తకళలను పునరుద్ధరించేందుకు పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, కళాకారుల నైపుణ్యానికి తగిన గుర్తింపు మరియు మార్కెట్ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా హస్తకళల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ హస్తకళా కార్పొరేషన్ ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’ (ODOP) పథకాన్ని అమలు చేస్తూ, మొత్తం 36 హస్తకళా ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తోంది. మార్కెటింగ్, ప్రచారం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో కార్పొరేషన్ కీలక సహాయం అందిస్తోందని ఆయన తెలిపారు.

వనిపెంట గ్రామంలో తరతరాలుగా బ్రాస్ & బెల్ మెటల్ వస్తువుల తయారీలో నిమగ్నమై ఉన్న కళాకారుల కోసం 11.1 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కామన్ ఫెసిలిటీ సర్వీస్ సెంటర్ (CFSC) ఆధునిక వసతులను అందిస్తూ, కళాకారుల పనిసామర్థ్యాన్ని మరింత పెంచుతోందని హరిప్రసాద్ వివరించారు.

ఈ గురు–శిష్య శిక్షణ కార్యక్రమంలో మొత్తం 30 మంది శిక్షార్థులకు రెండు నెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. గురువులుగా శ్రీనివాస్, ప్రకాష్, వెంకటేశ్వర్లు వంటి అనుభవజ్ఞులు శిక్షణ అందించనున్నారు. “గురువు అనేది తల్లిదండ్రులతో సమానం; శిష్యుల భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువే” అని హరిప్రసాద్ అన్నారు.

హస్తకళలను పరిరక్షించడం, కళాకారుల ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ కల్పించడం, వారి వస్తువుల విలువ పెంచడం, ODOP కార్యక్రమాన్ని మరింత విస్తరించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. వనిపెంట కళాకారులు సొంత ఇళ్లలో నుంచే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించే స్థాయికి తీసుకెళ్లేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, వారి తయారీ ఉత్పత్తులకు తగిన ధర లభించేలా లేపాక్షి ద్వారా పూర్తి సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు.

హస్తకళల వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రభుత్వం, కార్పొరేషన్, సమాజం, కళాకారులు ఒకటిగా ముందుకు సాగాలని హరిప్రసాద్ గారు పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *