మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సినిమా పరిశ్రమ తప్పు లేకపోయినా తెలుగు చిత్రసీమకే నష్టం కల్గించే సంఘటనలు కొందరి ద్వారా ఇటీవల ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో తామంతా ఆ నటుడు చెబుతున్న అభిప్రాయంలో ఏకీభవించడం లేదని, సినిమా టిక్కెట్ల విషయంలో ఆన్లైన్ విధానంకు మద్దతు ఇస్తున్నామని, తమ ఆర్ధిక ఇబ్బందులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సినిమా నిర్మాతలు తనను అబ్యర్ధించినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. .
బుధవారం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో మంత్రి పేర్నినానితో తెలుగు సినీ నిర్మాతలు దిల్ రాజు,డి వి వి దానయ్య, బన్ని వాసు,సునీల్ నారంగ్,వంశీ రెడ్డి తదితర నిర్మాతల బృందం సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై కూలంకుషంగా చర్చించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టిందన్న నేపథ్యంలో 50 శాతం ఉన్న సదుపాయాలను వంద శాతంకు పెంచమని ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో కోరామని, అలాగే నిర్వహణ వ్యయం, తమ పెట్టుబడులు తదితర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం టిక్కెట్ల ధర విషయంలో మరోమారు యోచించాలని నిర్మాతలు కోరారన్నారు. ఏకాభిప్రాయంపై ఆన్లైన్ విధానం తామే అడిగామని మాకే ఆ పద్ధతి ఎంతో అవసరమని తమ సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే అమ్ముతుందనే విషయం ఎక్కడా చెప్పలేదని, ఆన్లైన్ టికెట్ విధానంకు అందరం అనుకూలంగా ఉన్నామని నిర్మాతలు అందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నట్లు ప్రభుత్వం తెలియచేయమని చెప్పినట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టేది కాదని ఆన్లైన్ విధానం ఈనాటిది కాదని 2005 సంవత్సరం నాటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఆన్లైన్ విధానం కొనసాగిందని ఈ విషయం ఎందరికో తెలియని సంగతని, పలు థియేటర్లలో ‘బుక్ మై షో , పే టీఎం , జస్ట్ టికెట్స్ , పేరిట ఆన్లైన్ టికెట్ వ్యవస్థ కొనసాగుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఒక నిర్దిష్టమైన విధానం ఉంటే చిత్ర పరిశ్రమకు ప్రభుత్వానికి ఎంతో మంచిదని నిర్మాతలు కోరినట్లు చెప్పారు.
అనంతరం ప్రముఖ సినిమా నిర్మాత దిల్ రాజా మాట్లాడుతూ తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ ఎంతో సున్నితమైనదని, లేనిపోని వివాదాస్పద అంశాలు లేవనెత్తి గందరగోళ పరిస్థితులు దయచేసి లేవనెత్తవద్దని చిత్ర పరిశ్రమకు సంబంధించిన వివిధ సమస్యలు ప్రభుత్వానికి విన్నవించుకొంటున్నామని తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాలు చిత్ర పరిశ్రమ బాగుండాలనే కోరుకొంటాయని తమ పట్ల ఎంతో సానుకూలంగా ఉంటున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు, జరుగుతున్న వ్యతిరేక పరిణామాలు తమ అభిప్రాయం కాదని, ముఖ్యమంత్రికి తమ అభిప్రాయం దయచేసి తెలియచేయాలని మంత్రి పేర్ని నానికు వివరించినట్లు దిల్ రాజు పేర్కొన్నారు.
Tags machilipatnam
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …