అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
అగిరిపల్లి మండలంలో జగనన్న ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలనీ రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం జగనన్న ఇళ్ళ నిర్మాణ ప్రగతి పై మండల స్థాయి అధికారులతో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుతం నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా అర్హులైన పేదలందరికీ పక్కా గృహాలకు అందించేందుకు జగనన్న ఇళ్లు పధకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాదన్నారు. ఇందుకోసం ఏర్పాటుచేసిన జగనన్న కాలనీలలో నీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, వంటి మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలనీ, ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నది, అంతే కాక సిమెంట్, స్టీల్, వంటి నిర్మాణ సామాగ్రిని సబ్సిడీ పై అందిస్తున్నది, ఈ విషయంపై లబ్దిదారులకు అవగాహన కలిగించి సద్వినియోగం చేసుకునేలా గృహనిర్మాణ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు క్షేత్ర స్థాయిలోని వాలంటీర్ దగ్గర నుండి గృహ నిర్మాణ శాఖ ఏ .ఈ . వరకు లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని, నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీల్ వంటి మెటీరియల్స్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని, సిమెంట్ వంటి మెటీరియల్ నిల్వ చేసేందుకు అవసరమైన గోడౌన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇళ్లను నిర్మించుకునే లబ్దిదారులకు సంబందించిన బిల్లులను వారం వారం చెల్లింపులు జరిగేలా గృహనిర్మాణ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, లబ్దిదారులకు బిల్లుల చెల్లింపులలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దార్ భరత్ రెడ్డి, ఎంపిడిఓ పి భార్గవి, గృహ నిర్మాణ శాఖ ఏ .ఈ. సిహెచ్. వెంకటేశ్వరారావు, ఏపీఎం పి రామకృష్ణ, పంచాయతీరాజ్ ఏ ఈ., వి. గిరిధర్, ప్రభృతులు పాల్గొన్నారు.
Tags agiripalli
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …