-ఆరోగ్యమే మహాభాగ్యం… : జాయింట్ కలెక్టర్ శివ శంకర్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డా. వైస్సార్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పధకముతో కలసి మూడు సంవత్సరములు అయిన సందర్భముగా ఆరోగ్య మాన్ థాన్ 3.ఓ ర్యాలీని జిల్లా కోఆర్డినేటర్ ఆఫీస్ నుండి బందరురోడ్డు కూడలి వరకు నిర్వహించారు. ఈ సందర్భముగా జాయింట్ కలెక్టర్ హెల్త్ మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైస్సార్ రాజా శేఖర్ రెడ్డి పేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీని తీసుకువచ్చారన్నారు. నేడు డాక్టర్ వైస్సార్ ఆరోగ్యశ్రీ కింద పేదలందరికీ మెరుగైన సూపర్ స్పెషలిటీ వైద్యం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని, పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. ఈ సందర్భముగా జిల్లా లో గత 13 సంవత్సరముల నుండి ఆరోగ్యశ్రీ పతాకం లో సేవలందిస్తున్న 100 మంది ఆరోగ్య మిత్ర లకు మరియు జిల్లా IMA , విజయవాడ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ, పిన్నమనేని మెడికల్ కాలేజీ కి జాయింట్ కలెక్టర్ హెల్త్ చేతులమీదుగా ప్రశంస పత్రములను అందజేసినారు. ఈ కార్యాక్రమములో జాయింట్ కలెక్టర్ హెల్త్ శివ శంకర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ జ్యోతిర్మణి , జిల్లా కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ డాక్టర్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.