విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ర్య గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాష్ర్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సమావేశం అయ్యారు. నూతనంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో సమీర్ శర్మ శనివారం గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. రాష్రంన్లో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలను గురించి సిఎస్ గవర్నర్ కు వివరించారు. సర్వీసు తొలి రోజులలో విజయవాడ నగర పురపాలక కమీషనర్ గా పనిచేసిన విషయాన్ని బిశ్వభూషణ్ హరిచందన్ కు తెలియచేసారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ క్షేత్ర స్దాయి సమస్యల పరిష్కారం పట్ల చొరవ చూపాలని, తదనుగుణంగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ పి సిసోడియా, సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …