-ఆర్డీవో శ్రీనుకుమార్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డివిజన్ పరిధిలో గల ప్రజలు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం స్పందనలో ఇచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవదిలోనే పరిష్కరించి ధరఖాస్తుదారునికి న్యాయం చెయ్యాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రజలు తమ సమస్యలు పరిష్కారం నిమిత్తం స్పందనలో వచ్చిన అర్జీలను పరిశీలించి నిర్ణీత కాలవ్యవధిలో అర్జీదారునికి పరిష్కార పత్రాన్ని అందించాలన్నారు. తమ పరిధిలోని కాని అర్జీలను ఉన్నాతాధికారులకు పంపించి పరిష్కరించే విదంగా చర్యలు చేపట్టాలన్నారు. డివిజనల్ మెజిస్ట్రేట్ హోదాలో డివిజన్ పరిధిలోని కలిదిండి, గుడివాడ, ముదినేపల్లి, గుడ్లవల్లేరు మండలాల్లో కోర్టులో పెండింగ్ లో పలు భూసమస్యల పై లాయర్లు వాదనలను వినడం జరిగిందని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కోరోనా పోయిందిలే అని ఎవరూ అశ్రద్దగా ఉండవద్దని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కరోనా ప్రభలకుండా అప్రమత్తతో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్కలు ధరించడం, శానిటేషన్ వినియోగం, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు.
అర్జీలు :-
నందివాడ మండలం లక్ష్మీనరశింహపురం గ్రామానికి చెందిన తమ్మినేని పార్వతి వారి అర్జీలో తాతల నాటి నుంచి తనకువారసత్వంగా వచ్చిన 46 సెంట్లు భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ద్వారా శిస్తు కూడా చెల్లిస్తున్నాని, అయితే ఇటీవలి నాభూమి ఆన్ లైన్ లో లేదని శిస్తు కట్టనవసరం లేందటున్నారు. కావున అధికారులు న్యాయం చేయాలని కోరారు.
నందివాడ మండలం తమిరిశ గ్రామానికి చెందిన నగుళ్ల వెంకటేశ్వరావు తమ అర్జీలో వారసత్వంగా మా త్రండ్రిగారి నుంచి మా అన్నదమ్ములకు 60 సెంట్లు భూమి వచ్చినది. ఈ భూమిని మా ఇరువరకీ సమ బాగాలు చేసి ఇప్పించాలంటూ ఆర్జీలో పేర్కొన్నారు.
గుడ్లవల్లేరు మండలం విన్నకోటకు చెందిన గాలంకి నాగేంధ్రరరావు తమ అర్జీలో 2020 సంత్సరంలో మత్స్యకార పెన్షన్ కొరకు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసియున్నాని, ఇంతవరకు మత్స్యశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవలేదని కావున నా దరఖాస్తును పరిశీలించి పెన్షన్ మంజూరు చేసి న్యాయం చెయ్యాలని కోరారు.
అర్జీలతో పాటు గుడివాడ, ముదినేపల్లి,గుడ్లవల్లేరు, కలిదిండి మండలాల్లో కోర్టులో పెండింగ్ లో ఉన్న పలు భూమ సమస్యలు పరిష్కారం నిమిత్తం డివిజనల్ మెజిస్ట్రేట్ హోదాలో ఇరుపక్షాల లాయర్లు ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు.
కార్యక్రమంలో కార్యాలపు ఏవో స్వామినాయుడు, డీటీ బాలాజీ, డఎల్పీవో నాగిరెడ్డి, ఆర్ డబ్ల్యూఎస్.ఈఈ లీలా కృష్ణ, డ్రైనేజీ ఏఈ ప్రసాద్, ఆర్ అండ్ బీ కార్యాలపు సీ.అ. మహేష్, కోపరేటివ్ కార్యాలపు జూ.అ. గోవీనాధ్, ఐసీడిఎస్ సూపర్ వైజర్ బేబీ సరోజిని తదితరులు హాజరయ్యారు.