Breaking News

పాలిటెక్నిక్ అడ్మిషన్లు ప్రారంభమవుతున్న దృష్ట్యావిద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలి…

-ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు

కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త :
పాలిటెక్నిక్ విద్యార్థులకు కావలసిన అన్నిరకాల వసతుల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు) అన్నారు. సోమవారం కలిదిండి పాలిటెక్నిక్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరారవు మాట్లాడుతూ అడ్మిషన్స్ ప్రారంభమవుతున్న ఈ సమయంలో విద్యార్థుల కు హాస్టల్ సౌకర్యం తప్పనిసరి అని, ఈ విషయం పై ఉన్నతాధికారులతో మాట్లాడమని ప్రిన్సిపాల్ కోరాన్నారు. . జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి వారికి తాను ఫోన్ ద్వారా విషయం తెలియజేసి, సమస్య పరిష్కారం కోరగా వారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వారిని కలిసి అవసరమైన అనుమతులు తేవడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.పాలిటెక్నిక్ భవనాల నిర్మాణం మొదలుపెట్టి శరవేగంగా కట్టేందుకు చర్యలు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్, ఎంఈఓ నరేష్ కుమార్, ఎంపిపి చందన ఉమామహేశ్వరరావు, జడ్పీటీసీ బొర్రా సత్యవతి, AMC చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు,రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి శ్రీదేవి,మండల వైస్ ఎంపిపి కూసంపూడి కనకదుర్గా రాణి,ఎంపీటీసీ లు నీలి సుమన్,ఛాన్ బాషా, నాయకులు, వడుపు రామారావు,కొల్లాటి సత్యనారాయణ, గండికోట ఏసుబాబు, పోసిన రాజీవ్ భరత్, సాన వెంకటరామారావు, ఊర శ్రీధర్, బత్తిన ఉమా, అనపర్తి వడ్డికాసులు, గోదావరి సత్యనారాయణ, తట్టిగోళ్ల నాంచారయ్య, చలమలశెట్టి లక్ష్మయ్య,చిట్టూరి వాసు, మహ్మద్ షాఫయీతుల్లా, వెంకటరెడ్డి, కందుల వెంకటేశ్వరరావు కాల్వ నల్లయ్య,, గుడివాడ ఫణి, మెండ నవీన్, ,పాల్గొన్నారు.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *