-ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు
కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ కష్టకాలంలో దానిని అరికట్టే చర్యల్లో అవసరమైన సామగ్రిని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల తెలుగు సొసైటీ వారిని అభినందిస్తున్నానని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కలిదిండి ప్రాథమిక ఆరోగ్య కేంధ్రానికి ఏపీఎన్ ఆర్టీఎస్. సంస్థ రూ.2 లక్షలు విలువచేసే సామగ్రి పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా హృదయం భగవన్నిలయమని, .ప్రవాసాంధ్రులు ఏదూర తీరాల్లో ఉన్నా, స్వంత గడ్డకు సేవ చేయాలనే సంకల్పం తో ప్రవాసాంధ్రుల తెలుగు సొసైటీ గా ఏర్పడి ఎన్నో సేవలు అందించడం ఆనందదాయకం అన్నారు.ముఖ్యంగా సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి ఈ ప్రాంత బాధ్యులు అనుమోలు నరేష్ కుమార్ , కలిదిండి ప్రాంత ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.కలిదిండి పీహెచ్ సీ అభివృద్ధి విషయాన్ని గత పాలకులు గాలికి వదిలివేశారని అన్నారు.మండల ప్రధాన కేంద్ర ఆసుపత్రి అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టి చుట్టూ బరంతు తోలి ప్రహరీగోడ నిర్మించి,ఇతర మౌళిక సదుపాయాలు కల్పించడానికి రూ.49 లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇంకా అవసరమైతే ప్రజావిరాళాలు కూడా సేకరించి అభివృద్ధి చెయ్యడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీఎన్ ఆర్టీఎస్. సంస్థ ప్రతినిధులు అనుమోలు నరేష్ కుమార్, ఎంపిపి చందన ఉమామహేశ్వరరావు, జడ్పీటీసీ బొర్రా సత్యవతి, ఏఎంసీ చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు,రాష్ట్ర క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి శ్రీదేవి,మండల ఉపాధ్యక్షురాలు కూసంపూడి కనకదుర్గా రాణి,ఎంపిటిసిలు నీలి సుమన్,ఛాన్ బాషా,ఇంచార్జ్ సర్పంచ్ ముత్తిరెడ్డి సత్యనారాయణ, నాయకులు, వడుపు రామారావు, కొల్లాటి సత్యనారాయణ, పోసిన రాజీవ్ భరత్, సాన వెంకటరామారావు, ఊర శ్రీధర్, బత్తిన ఉమామహేశ్వరరావు, అనపర్తి వడ్డికాసులు, చిట్టూరి బుజ్జి, గోదావరి సత్యనారాయణ, చిట్టూరి వాసు,మహ్మద్ షాఫయీతుల్లా, తట్టిగోళ్ల నాంచారయ్య, కందుల వెంకటేశ్వరరావు, పెటేటి వివేకానంద, గొరిపర్తి వెంకటరెడ్డి, చలమలశెట్టి లక్ష్మయ్య, కాల్వ నల్లయ్య, గుడివాడ ఫణి, ఆండ్రాజు దుర్గారావు, ఘంటసాల సురేష్, అనుమోలు చందు, పెరుగు నాగరాజు, హాఫిజ్, రేవు నరసింహరావు, ఆండ్రాజు కృష్ణమూర్తి, తిరుమాని నాగరాజు, పీహెచ్ సీ వైద్యాధికారి డా.ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.