విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలకు హాని కల్గించేలా కల్తి లేదా కుళ్ళిన మాంసం విక్రయాలు సాగించిన యెడల అట్టి వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు.
సింగ్ నగర్ ప్రాంతములో కల్తి మాంసపు విక్రయాలు జరుగుచున్నవని ప్రజల నుండి వచ్చిన సమాచారo మేరకు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాలకు అనుగుణంగా ప్రజారోగ్య అధికారులు సిబ్బందితో కలసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగర పాలక సంస్థ వెటర్నరి అసిస్టెంట్ సర్జన్ డా.ఏ.రవిచంద్ అద్వర్యంలో ఫుడ్ శానిటరీ ఇన్స్ పెక్టర్ గోపాల్ కృష్ణ, శ్రీకాంత్ మంగళవారం ప్రకాష్ నగర్, డాబా కోట్ల సెంటర్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలలోని మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించడమైనది. ముఖ్యంగా కల్తి మాంసం అమ్ముతున్నరనే ఆధారాలతో ఈ తనిఖి చేయడం జరిగింది. ప్రకాష్ నగర్ లో కుళ్ళి పోయిన మరియు చనిపోయిన కోళ్ళు లివర్, కందన కాయలు అమ్ముతున్న షాపు యజమాని పై రూ.4000/- జరిమానా విధించుటతో పాటుగా కల్తి రంగులు కుడా పట్టుకోవటం జరిగింది.
అదే విధంగా NM-Veg రెస్టారెంట్ నందు sypthic కెమికల్స్ పట్టు కోవటం జరిగినది. ఆ రంగుల వల్ల హానికరం కెమికల్స్ వల్ల కాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని తెలిసినది. ట్రేడ్ లైసెన్సు మరియు ఫుడ్ లైసెన్సు లేని రెండు రెస్టారెంట్లు పైన ఫుడ్ ఇన్స్ పెక్టర్లు దాడులు నిర్వహించి ఒక్కోక్కరికి రూ.10,000/- చొప్పన జరిమాన విధించి వసూలు చేయడం జరిగింది. ఎవరిన కల్తి మాంసం మరియు కుళ్ళిపోయిన మాంసం అమ్మిన యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఈ ప్రకటన ద్వారా కమిషనర్ హెచ్చరించారు.