-హౌసింగ్ నిర్మాణ పనులు వేగవంతము చేయాలనీ అధికారులు మరియు కాంట్రాక్టులకు ఆదేశాలు
-నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు ఇల్లు కార్యక్రమమునకు సంబందించి నున్న లే అవుట్ నందు చేపట్టిన హౌసింగ్ నిర్మాణ పనుల యొక్క పురోగతిని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ఈ సందర్బంలో ఈ ప్రాంతములో 954 ఇళ్ళకు గాను 335 ఇల్లు బేస్ మేట్ వరకు వచ్చినవని అధికారులు వివరించారు. నిర్మాణ పనుల వేగవంతంగా చేయుటకు తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేసారు. ఈ సందర్బంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న వార్డ్ ఎడ్మిన్ లకు పలు ఆదేశాలు ఇచ్చారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీ.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల ప్యాచ్ వర్క్ పనులు వేగవంతముగా పూర్తి చేయాలి…
వన్ టౌన్ ప్రాంతములో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
నగర పర్యటనలో భాగంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి వన్ టౌన్ ప్రాంతములోని పలు ప్రదేశాలలో పర్యటించారు. సితార జంక్షన్ బైపాస్ రోడ్ నందు చేపట్టిన ప్యాచ్ వర్క్ పనులను మరియు రిలయన్స్ మార్క్ ప్రక్క రోడ్ నందు వేసిన సి.సి రోడ్ లను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. దసరా ఉత్సవాల సందర్బంలో దుర్గ గుడికి వచ్చు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే విధంగా పారిశుధ్య నిర్వహణ విధానము డ్రెయిన్ లలో మురుగునీటి పారుదల మొదలగు అంశాలను పరిశీలిస్తూ, డ్రెయిన్లు ఎక్కడ పొంగి పొర్లకుండా చూడాలని మరియు రోడ్లు అన్నియు ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్ట్రీట్ ఫర్ పీపుల్ కార్యక్రమములో భాగంగా ఎన్.ఆర్.పి రోడ్ నందు చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.