-నూరు శాతం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సర్వీసుల్లో ఏ ఒక్కటి జాప్యం లేకుండా నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలని సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ జె. నివాస్ సూచించారు.
మంగళవారం నగరంలోని పటమట హైస్కూల్ రోడ్డు, డివిజన్ నెం 9లోని 45నెం వార్డు సచివాలయాన్ని కలెక్టర్ జె. నివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సచివాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ప్రతి రోజు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో వుంటూ వారికి మెరుగైన సేవలందించాలన్నారు. ప్రజలకు సేవలందించడంలో ఏ ఒక్కరూ కూడా జాప్యం, నిర్లక్ష్యం వహించకూడదన్నారు. బయోమెట్రిక్ హాజరు తీరును ఆయన పరిశీలించారు. సచివాలయ సిబ్బంది డివిజన్‌లోని ప్రజలకు కోవిడ్ నివారణ సూచనలు, వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన పరచాలన్నారు.వార్డులో ఏమైన కోవిడ్ కేసులు వచ్చాయఅని కలెక్టర్ వాకబు చేయగా సచివాలయ సిబ్బంది మాట్లడుతూ గతంలో 30 కేసుల వరకు నమోదు అయ్యాయని ప్రస్తుతం 2 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు. వార్డు సచివాలయ పరిధిలో నూరు శాతం వ్యాక్సినేషన్ జరగాలన్నారు. వ్యాక్సినేషన్ వేసుకోని వారిని వాలంటీర్ల ద్వారా గుర్తించి వారికి కోవిడ్ టీకాలు వేయాలన్నారు. ఫీవర్ సర్వేకి సంబంధించి నివేదికలను సక్రమంగా ఫైలింగ్ చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ క్యాలండర్, ఇతర అంశాలకు సంబంధించిన పోస్టర్లను సచివాలయంలో ప్రదర్శించిన తీరు ఆయన పరిశీలించారు. డెంగ్యు, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రభలకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సచివాలయంలో వార్డు మహిళ సంరక్ష కార్యదర్శి ఎస్. తనూష, వార్డు రెవెన్యూ కార్యదర్శి ఆత్మకూరి అనితలను పలకరించి వారు నిర్వహిస్తున్న విధుల తీరును అడిగి తెలుసుకున్నారు. దిశ యాప్ పై మహిళల్లో అవగాహన కల్పించి దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా చూడాలన్నారు. వీరి వెంట జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్ శివశంకర్ తదితరులు ఉన్నారు.