విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర విజయవాడ వారి ఆధ్వర్యంలో స్థానిక బాపు మ్యూజియం నందు క్లీన్ ఇండియా ప్రోగ్రాం లో భాగంగా ఐకానిక్ ప్లేస్ యాక్టివిటీ కింద కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా హాజరు అవ్వ గా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు డాక్టర్ జి వాణిమోహన్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు బి జె ప్రసన్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు అధ్యక్షత వహించారు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి దీప ప్రజ్వలన తో మొదలైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి శాసనసభ్యులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న క్లీన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ రహిత సమాజంతో పర్యావరణ పరిరక్షణ జరగాలని ఆకాంక్షించారు గౌరవ మేయర్ గారు మాట్లాడుతూ క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ అలాగే క్లీన్ ఇండియా కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం స్వచ్ ఆంధ్ర ప్రదేశ్ మరియు స్వచ్ఛభారత్ ఆవిష్కరణ అని అందువల్ల పౌరులందరూ భాగస్వాములై స్వచ్ఛందంగా పర్యావరణ పరిరక్షణకు చేయూతనివ్వాలని కోరారు ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిమోహన్ మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు మరియు నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు యువజన సంఘ సభ్యులు ఎన్జీవోలు అందరూ కూడా వారి వారివారి ప్రదేశాలలో ఉన్న దేవాలయాలలో మరియు ఇతర మత పరమైన ప్రదేశాలలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ హిత హానికి పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ రాష్ట్ర సంచాలకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు నిర్వహిస్తున్న క్లీన్ ఇండియా కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 వేలకు పైగా ఉన్న యువజన సంఘాలు మరియు ఎన్జీవోలు నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు జిల్లా మరియు గ్రామీణ స్థాయి యంత్రాంగం సహకారంతో ఈ నెల మొత్తం మీద 354865 కేజీ ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏరి వేయాలని ఈ రోజు వరకు సుమారు 149540 కేజీ ల ప్లాస్టిక్ ను తరలించడం జరిగిందని ఈ నెలాఖరులోపు టార్గెట్ ప్రకారం అంతకంటే ఎక్కువ ప్లాస్టిక్ ను సేకరించి డంపింగ్ యార్డ్ లకు తరలించడం జరుగుతుందని ఈరోజు ఈ కార్యక్రమం ఐకానిక్ ప్లేస్ కింద గుర్తింపబడిన బాపు మ్యూజియం నందు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ఆఫీసర్ సుంకర రాము వాసవ్య మహిళా మండలి వారి నుంచి రేష్మి యూనిసెఫ్ నుంచి రాధిక చైల్డ్ ఫండ్ ఇండియా నుంచి సౌజన్య నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో ముగిసిన ఈ కార్యక్రమం అనంతరం ఫ్లాగ్ రన్ను నిర్వహించడం జరిగింది.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …