విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలు అమలు చేస్తూ ప్రతి పధకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం జెమ్మిచెట్టు సెంటర్, బోయపాటి శివరామకృష్ణ మున్సిపల్ హైస్కూల్ జరిగిన వైయస్సార్ ఆసరా రెండవ విడత నగదు మంజూరు అయిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 7,8 డివిజిన్ల లబ్ధిదారులతో నిర్వహించిన ఆసరా సంబరాలు కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా డివిజన్లలో 370 గ్రూపులకు మంజూరు అయిన దాదాపు 3కోట్ల 20లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేయడానికి,వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేయడానికి జగన్ గారు వైయస్సార్ ఆసరా ద్వారా వారికి ఆర్థిక సహాయం చేస్తూ స్వయం ఉపాధి కల్పన చేస్తున్నారు అని,అదేవిధంగా అమ్మఒడి, చేయూత ఇలా ప్రతి పధకంలో నేరుగా మహిళలకు లబ్ది చేకూరేలా అమలు చేయడంతో పాటు ఇళ్ల పట్టాలు కూడా వారి పేరు మీదనే ఇస్తూ అసలైన మహిళ పక్షపతిగా నిలిచారని కొనియాడారు.మహిళలలో రోజురోజుకు ముఖ్యమంత్రి కి పెరుగుతున్న ఆదరణ చూసి,ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి అయితే ఇక వారికి రాజకీయ భవిష్యత్ ఉండదు అనే దుర్బుద్ధితో ప్రతిపక్ష పార్టీలు కోర్టులు ద్వారా ఇళ్ల నిర్మాణం అడ్డుకోవడం దారుణమని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన పేదవారి సొంతింటి కలను జగన్ నెరవేరిస్తారని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా పై స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కో ఆప్షన్ మెంబెర్ ముసునూరు సుబ్బా రావు, 7 వ డివిజన్ కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి, 8 వ డివిజన్ ఇంచార్జి కొత్తపల్లి రజిని, వైసీపీ నాయకుల ఆళ్ల చెల్లారావు, కుటుంబరావు, సంపత్, క్లేవ్, సుధీర్, రాజకమల్, గల్లా రవి, ఉదయ్, శంకర్ మరియు రెండు డివిజన్ల నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …