విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమెరికా లో జరిగిన ప్రపంచ అర్చరీ ఛాంపియన్షిప్ పోటీలలో మూడు సిల్వర్ మెడల్స్ గెలుచుకున్న క్రీడాకారిణి కుమారి వెన్నం జ్యోతి సురేఖ గారిని ఈ రోజు వారి స్వగృహం నందు తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ కలిసి చిరు సత్కారం చేయటం జరిగినది. ఈ సందర్భంలో అవినాష్ గారు మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని వారిని మనం ప్రోత్సహిస్తే ఇలాంటి మరి ఎన్నో పధకాలును దేశానికీ అందిస్తారు అని అన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో క్రీడాకారులకు తగిన ప్రొత్సాకం ఇచ్చి అన్ని విధాలుగా వారికి తోడుగా ఉంటున్నదని అన్నారు. కుమారి వెన్నం జ్యోతి సురేఖ గారు ఇలాంటి పధకాలు మరిఎన్నో సాధించి ప్రపంచ వ్యాప్తముగా మన భారత దేశం కీర్తి, ప్రతిష్ట లను పెంచాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …