Breaking News

ప్రజల సంక్షేమం జగనన్న ప్రభుత్వ లక్ష్యం…

-కొవ్వూరు పట్టణ పరిధిలో వైఎస్సార్ ఆసరా 2వ విడత రూ. 4 కోట్ల 35 లక్షలు విడుదల
-సమాజంలో మహిళలకు భద్రత, భరోసా కల్పించడం చేస్తున్నాము
– మహిళల సాధికారత , ఆర్ధిక భరోసా , భద్రతకై జగనన్న నిత్యం ఆలోచన చేస్తున్నాం..
-దిశా యాప్ ను ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్
-మంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు పురపాలక సంఘం పరిధిలో వైఎస్సార్ ఆసరా పథకం కింద రెండో విడతలో 543 స్వయం సహాయక సంఘంకి చెందిన మహిళలకు రూ.4,35,11,144 లు మేర ప్రయోజనం వారి ఖాతాల్లోకి జమ చెయ్యడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం స్థానిక యువరాజ్ ఫంక్షన్ హాల్ లో వైఎస్సార్ ఆసరా 2వ విడత పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీకి కట్టుబడి 4 విడతల్లో రూ.27 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తూ తీసుకున్న నిర్ణయం , ఈ రోజు రెండో విడత సొమ్మును ఖాతాలోకి జమ చేస్తున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. వైఎస్సార్ ఆసరా ఫేజ్ -II కింద కొవ్వూరు నియోజకవర్గంలోని అక్కచెల్లమ్మలకు 2019 ఏప్రిల్ 11 న స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉన్న అప్పు రూ.146 కోట్లు ఉందన్నారు. ఆ మొత్తాన్ని 4 విడతల్లో తీర్చుతానని జగనన్న హామీ మేరకు తొలి విడత సొమ్ము 2020 సెప్టెంబర్ 11న జమచేశారు. ఈరోజు రెండో విడతగా రూ.36.53 కోట్లు బ్యాంకు ఖాతాలను జమచేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలను పకడ్బందీగా అమలు చేసేందుకు క్యాలెండర్ రూపొందించి వ్యక్తి దేశంలో నే కాదు, ప్రపంచంలో నే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్ధిక ఇబ్బందులకు వేరవక , వెనకడుగు వెయ్యకుండా వాటిని అమలు చేసిన విషయం తెలిసిందే అన్నారు. నవరత్నాలు లో అధిక సంఖ్యలో లబ్ది పొందిన వాళ్ళు మహిళలే అన్నారు. 2వ విడత వైఎస్సార్ ఆసరా కింద జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ని 9033 ఎస్.హెచ్. జి. సంఘాలకు రూ.298.10 కోట్లు ను వారి వ్యక్తిగత ఖాతాకు జమచేస్తున్నామన్నారు. తొలి విడతగా 8926 గ్రూపులకు రూ.294.85 కోట్లు జమచెయ్యడం జరిగింది. రెండో విడతలో అర్హత కలిగిన మరో 107 గ్రూపులకు రూ.3.25 కోట్లు అదనంగా అందచేసామన్నారు. గత ప్రభుత్వం 2014 డ్వాక్రా రుణాలు చెల్లించవద్దని చెప్పడంతో అప్పటివరకు ఏ, బి , సి గ్రేడుల్లో ఉన్న గ్రూపులు డిఫాల్ట్ గ్రూపులు అయ్యాయి. కొవ్వూరు పట్టణంలోని 149 గ్రూపులు డిఫాల్ట్ అవ్వడం జరిగిందన్నారు. మహిళలు పారిశ్రామిక వేత్తలు గా, విద్యా వంతులుగా తీర్చిదిద్దేందుకు ఒక మేనమామ ల, అన్నగా ఆలోచన చేయ్యడం, అమలు చేస్తున్నారు. సబాధ్యక్షత మునిసిపల్ చైర్ పర్సన్ బావన రత్నకుమారి వహించారు. డ్వాక్రా మహిళలు తాము తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించి వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ది పొందారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ, పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతోంది. మహిళలు ఎవ్వరి మీద ఆధారపడకూడదు అనేదే జగనన్న ఉద్దేశ్యం అన్నారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించండి, వాటిని 4 దశల్లో తిరిగి చెల్లిస్తానని ఇచ్చిన హామీ నేడు మన మహిళలకు రెండో విడతగా విడుదల చేశారన్నారు. ఆ మొత్తం సద్వినియోగం చేసుకుని, అభివృద్ధి చెందాలని కోరారు. సంక్షేమ పథకాలను లబ్దిదారుల ఇంటివద్దనే అందించి, వారికి అడుగడుగునా అండగా నిలుస్తున్నాము.

ఎంమెప్మా పీడీ ఇమాన్యుయేల్ మాట్లాడుతూ, రెండో ఏడాది వైఎస్సార్ ఆసరా కార్యక్రమంను 3 దశల్లో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం 30 పైగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, మహిళా లకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా, మహిళలకు ఏ లోటు లేకుండా పధకాలను ప్రకటించడం అమలు చేయడం జరుగుతోందని తెలిపారు.

తొలుత జ్యోతిప్రజ్వలన చేసి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మెప్మా ప్రతిజ్ఞ చేయించారు. ఈ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ మన్నే పద్మ, గండ్రోతూ అంజలీదేవి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, ఏ ఎంసి ఛైర్మన్ శ్రీనివాసరావు, కొవ్వూరు మునిసిపాలిటీ కి చెందిన వార్డు సభ్యులు, మెప్మా పీడీ ఇమాన్యుయేల్, మునిసిపల్ కమిషనర్ కేటి సుధాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, డ్వాక్రా మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *