Breaking News

పసివేదల, వేములూరు, నందమూరు మహిళలకు రూ. కోటి 26 లక్షలు ఆసరా

-వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ..
-మంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు సంతోషంగా ఉండి, మీ కుటుంబాల కు ఆధారంగా ఉండాలని, మహిళలు ఆర్ధిక, సామాజిక సాధికారత దిశగా అడుగులు వెయ్యలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.

బుధవారం పసివేదల గ్రామంలో పసివేదల, వేములూరు, నందమూరు గ్రామాల వైఎస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరుతో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామన్నారు. ఇందుకు కారణం ఎవరు? అని .. మంత్రి ప్రశ్నించగా…. మన జగనన్న అని మహిళలు నినాదాలు చేశారు. ఆసరా, చేయూత, బ్యాంకు రుణాలు మీమీ కుటుంబాల అభివృద్ధి కోసం మాత్రమే సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ఒక అన్నలా, మేనమమలా, కన్నతల్లి కంటే ఎక్కువగా మన కోసం ఆలోచిస్తున్నారు.

పసివేదల గ్రామంలో 100 స్వయం సహాయక సంఘాల కి రూ 58.95 లక్షలు, వేములూరు గ్రామంలో 76 గ్రూపులకు రూ.39.35 లక్షలు, నందమూరు గ్రామంలో 26 గ్రూపులకు రూ.26.36 లక్ష లు వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కు ను మంత్రి అందచేశారు.

కొవ్వూరు ఎంపిపి కాకర్ల నారాయుడు, జడ్పిటిసి బి. వెంకటలక్ష్మి, సర్పంచ్ లు పసివేదల టి. సింహాచలం, వేములూరు ఏ. శ్రీనివాస్, నందమూరు కె. గంగా భవాని, ఏఎంసి చైర్మన్ వల్లభశెట్టి శ్రీనివాసరావు, ఎంపిటిసి లు నూతంగి రేఖ, కె.నవ్యశ్రీ, రెల్ల సరస్వతి, డీఎల్ డిఓ , ఎంపీడీఓ పి. జగదాంబ, తాహసీల్దార్ నాగరాజు నాయక్ , స్థానిక ప్రజాప్రతినిధులు, డ్వాక్రా మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *