-బిళ్లపాడులో రూ. 61.80 లక్షలతో గ్రామ సచివాలయం, ఆర్బీలను ప్రారంభించుకున్నాం..
-రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల పొదుపు సంఘాల్లోని 78.76 లక్షల మంది మహిళా సభ్యులకు ఖాతాలకు రెండో విడత వైఎస్సార్ ఆసరగా రూ. 6,400 కోట్లు జమ..
-రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)
గుడివాడ రూరల్ , నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్. జగన్మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రవేశ పెట్టి అవినీతికి తావులేకుండా సుపరిపాలనను పట్టణ, గ్రామీణ ప్రజల ఇంటి ముంగిటకే అందింస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అన్నారు.
గుడివాడ రూరల్ మండలం బిళ్లపాడు గ్రామంలో రూ. 61.80 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి బుధవారం మంత్రి కొడాలి నాని ప్రారంబించారు. ఈ సందర్బంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్, అర్భన్ హెల్త్ క్లినిక్ లను ప్రవేశ పెట్టి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఇంటి ముంగిటకే మెరుగైన సౌకర్యాల కల్పిస్తూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య వ్యసస్థను ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టారన్నారు. అవినీతికి తావు లేకుండా ప్రజా సమస్యలు పరిష్కారం, ప్రభుత్వం పథకాలు లబ్దిదారులకు వేగవంతంగా అందిస్తుందన్నారు. పింఛన్ కావాలన్నా, రేషన్ కార్డు, ,ఇళ్ల స్థల పట్టాలు తాగునీటి పరిష్కారం, వైద్యం,ఆరోగ్యం, రెవిన్యూ, భూముల సర్, శిశు సంక్షేమం, డెయిరీ వంటి ఎన్నో రకాల ప్రభుత్వ సేవలను గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటలోనే సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందలేదని బాధపడే సమస్య ఉండదన్నారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రజలు నివశించే గ్రామాల్లోనే ఏర్పాటు చేసిన సచివాలయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొడాలి నాని అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుందన్న లక్ష్యంతో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు వ్యవసాయ సాగుకు సంబందించిన అన్ని మౌలిక సదుపాయాలు, మెలకువులు అందిస్తున్నారన్నారు. రైతుకు కావలసిన నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఆర్బేకేల్లోనే అందిస్తున్నారన్నారు. రైతు ఆర్థికంగా బలోపేతం చెందాలన్నఉద్దేశ్యంతో రైతు భరోసా ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారన్నారు.
స్వయ సహాయ సంఘాలకు రెండవ విడత ఆసరా ఆర్థిక భరోసానిస్తుంది :- మంత్రి కొడాలి నాని
నేనున్నాను.. నేను విన్నాను.. అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తన సూదీర్ఘ పాదయాత్రలో స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన హామీ నెరవేర్చారన్నారు. మహిళా స్వావలంబనే లక్ష్యంగా గత ఏడాది 6 వేల కోట్లు మొదటి వైఎస్సారా ఆసరా ను అందించగా నేడు రెండో విడత వైఎస్సార్ ఆసరా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల పొదుపు సంఘాల్లోని 78.76 లక్షల మంది మహిళా సభ్యులకు రూ. 6,400 కోట్లు వారి ఖాతాల్లో నేరుగా జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి దే అన్నారు.
ఈ సందర్బంగా గ్రామ సచివాలయం వద్ద వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నాయకులు దుక్కిపాటి శశిభూషన్ మొక్కలు నాటారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నాయకులు దుక్కిపాటి శశిభూషన్, యంపీపీ గద్దే పుష్పరాణి, జెడిపీటీ సభ్యులు గోళ్ల రామకృష్ణ, మున్సిపల్ కమీషనరు సంపత్ కుమార్, యంపీడీవో వెంకటరమణ, పంచాయితీరాజ్ ఏఇ సూరిబాబు, మార్కెట్ యార్డు డైరెక్టర చుక్కా నాగలక్ష్మి, గుడివాడ రూరల్ వైఎస్సార్ సీపీ కన్వీనర్ మట్టా జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.