Breaking News

మహిళల ఆర్థికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం…

-వైఎస్సార్ ఆసరాను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి.
-వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నాయకులు దుక్కిపాటి శశిభూషన్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు ఆర్థికాభివృద్ది చెందిదే తద్వారా సమాజాభివృద్ది చెందుతుందన్న గట్టి నమ్మకంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నాయకులు దుక్కిపాటి శశిభూషన్ అన్నారు.
వైఎస్సార్ ఆసరా రెండో విడత పంపిణీ లో భాగంగా బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో గుడివాడ రూరల్ మండల స్వయం సహాయక సంఘ సభ్యులకు వైఎస్సార్ ఆసరాగా 698 మంది గ్రూపుల్లోని 7112 మంది సభ్యులకు రూ. 5.65 కోట్లు చెక్కును మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా దుక్కిపాటి శశిభూణ్ మాట్లాడుతూ మహిళా ఆర్థిక స్వావలంబన, సమాజిక అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళలను ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా అభివృద్ధి బాటలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళల పెరుమీదే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా , చేయూత, వంటి పథకాలతో పాటు పేదల ఇళ్ల పట్టాలను కూడా మహిళల పేరుమీదుగానే ప్రభుత్వం అందిస్తుందన్నారు. మహిళలకు 50 శాతం పైగా సీట్లు రిజర్వేషన్లు కల్పించారన్నారు. గత ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేసిందని తన పాదయాత్రలో సీఎం డ్వాక్రా మహిళలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని, డ్వాక్రా రుణాలను తాను అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ళలో మాఫీ చేస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి వరుసగా రెండవ సంవత్సరం కూడా మహిళలకు ఆర్ధిక సహాయం అందించారన్నారు. ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితులలో కూడా సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం లేకుండా అమలు చేస్తున్నారన్నారు. వై.ఎస్.ఆర్ ఆసరా రెండవ విడతలో గుడివాడ రూరల్ మమండలంలో 698 డ్వాక్రా సంఘాలలో 7,112 మంది మహిళకు 5,64,68,949 రూపాయలు అందించారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అతి తక్కువ సమయంలోనే 90 శాతం మేర సీయం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు. నాడు- నేడు ద్వారా పాఠశాలలు, ఆస్పత్రులు ఆధునీకరణ, అంగన్ వాడీ కేంద్రాలు ద్వారా 6 రకాల పోషక విలువల గల ఆహారం, పుట్టిన బిడ్డ నుంచి ముదుసరి వరకు ప్రభుత్వ పథకాలను అందిస్తూ చేయూనిస్తుందన్నారు. అంగన్ వాడీలను ప్రీ ప్రైమరీ చేస్తూ నాణ్యమైన విద్యను ప్రాధమిక దశ నుంచే ఇంగ్లీషు మీడియం లో అందించే విధంగా చర్యలు చేపట్టారన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్ లు ద్వారా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్లస్థలాను అందించిన ఘనత ముఖ్యమంత్రి దే అన్నారు.
గుడివాడ రూరల్ మండలం యంపీపీ గద్దే పుష్పరాణి మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా వ్యాపారాల్లో అభివృద్ది చెందితే ఆకుటుంబాలు ఆర్థికం గా అభివృద్ది చెందుతాయన్నారు. వైఎస్సార్ ఆసరా రుణ మాఫీ నగదును ప్రతి అక్కచెల్లేమ్మ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
యంపీడీవో ఏ.వెంకట రమణ మాట్లాడుతూ మహిళలు తండ్రి, భర్త మీద ఆదారపడకుండా వారి ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు అందింస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఉండాలంటే పౌష్టికాహరం తీసుకోవాలన్నారు. మన ఇంటితో పాటు గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మన పై ఉందన్నారు. ఆదిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశుభ్రత ప్రాధాన్యతనిస్తూ జగనన్న స్వచ్చ సంకల్పం ద్వారా వందరోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో బాగస్వామ్యులై చెత్త రహిత గ్రామాలుగా తీర్చి దిద్దాలన్నారు. రోజువారి చెత్తను చెత్త సంపద కేంద్రాలకు తరలించడం ద్వారా సేంద్రీయ ఎరువులు ఉత్పతై రైతుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి మహా వృక్షాలుగా పెంచితే ప్రాణవాయువు సంవృద్దిగా ఉంటుందన్నారు.
ఈ సందర్బంగా డ్వాక్రా మహిళలకు 5,64,68,949 రూపాయల విలుగల చెక్కును అందజెశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా సంఘాల మహిళలు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
కార్యక్రంలో జెడ్పీటీసీ గోళ్ల రామకృష్ణ, ఎరియా కోఆర్డినేటర్ సుందరరావు, సిహెచ్ డీటీ గోపాల రావు ఎపీయం విజయకుమార్, గుడివాడ రూరల్ మండల వైసీపీ కన్వీనర్ జాన్ విక్టర్ పలువురు గ్రామ సర్పంచ్ లు, యంపీటీసి సభ్యులు, డ్వాక్రా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నరు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *