గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీకొండాలమ్మ దేవస్థానంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అమ్మవారి పాల పొంగళీ భవనాన్ని బుధవారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ శ్రీకొండాలమ్మ దేవస్థానం భక్తుల ఆదరణతో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆలయంలో పాల పొంగళీ భవనం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆలయ నిధులతో భవన నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నుండి కూడా అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటానని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు బాడిగ లీలాసౌజన్య, మన్నెం అమల, పడవల వెంకటేశ్వరరావు, పామర్తి వెంకటస్వామి, డోకాల భాగ్యలక్ష్మి, వల్లూరి పద్మావతి, నారేపాలెం వెంకట నిర్మల, ఈడే విజయ నిర్మల, ఎక్స్అఫీషియో సభ్యుడు ఆర్ఎస్ఎస్ సంతోష్ శర్మ, గుడ్లవల్లేరు ఎంపీపీ కొడాలి సురేష్, పార్టీ మండల అధ్యక్షుడు శాయన రవికుమార్, నాయకులు పెన్నేరు ప్రభాకర్, శేషం గోపి, ఎం లక్ష్మణరావు, అల్లూరి ఆంజనేయులు, రిటైర్డ్ కార్యనిర్వహణాధికారి ధర్మారాయుడు తదితరులు పాల్గొన్నారు
Tags gudivada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …