-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు
కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త :
లంకగ్రామాల్లో రోడ్ల సౌకర్యం మెరుగు పరచడానికి ఈ రెండున్నరేళ్లలో రూ. 25 కోట్ల రూపాయల నిధులు కేటాయించి చాలావరకు పనులు ప్రారంభించడం జరిగిందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. వైస్సార్ ఆసరా రెండవ విడత పంపిణీలో భాగంగా బుధవారం కలిదిండి మండలం పెద్దలంక హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్యఅతిదిగా పాల్గొని వైస్సారా ఆసరా చెక్కు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగనన్న ఇచ్చిన మాట ప్రకారం 4 విడతలలో 25 వేల కోట్ల రూపాయలు అక్కచెల్లమ్మలకు డ్వాక్రా రుణమాఫీ చేయాలని చెప్పిన తేదీ ప్రకారం అమలు చేస్తున్నారన్నారు. ఈ రోజు కేవలం కైకలూరు నియోజకవర్గనికి 46,76,54,896 కోట్ల రూపాయలు ఋణమాఫి జరిగిందన్నారు. దానిలో భాగంగా కలిదిండి మండలనికి వైఎస్సార్ ఆసరా రెండవ విడత 14 కోట్ల రూపాయల వచ్చాయన్నారు. మీ అందరి తరుపున ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి అక్కచెల్లమ్మలకు ప్రతి సంక్షేమ పధకం నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాలో వేస్తున్నారు. ఎక్కడ కూడా అవినీతికి తావులేకుండా వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, స్థాపించి రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారన్నారు. అర్హులు అయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పధకాలను అందిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థలలో మీరు అందరు కూడా జగనన్న సైనికులకు ఓట్లు వేసి గెలిపించారని, మీ రుణం నేను ప్రజాప్రతినిధులు ఎప్పటికి తీర్చుకోలేమన్నారు. ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని నిలుపుతూ మీరంతా నేను నిలబెట్టిన అన్నదమ్ములకు, అక్కచెల్లమ్మలకు ఓట్లు వేసి గెలిపించారు. రాబోయే రోజులలో మీ అందరి ఆశీస్సులతో జగనన్న మరింత సంక్షేమ కార్యక్రమాలు చేస్తారని, మరో ఇరవై, ఇరవయ్యయిదేళ్లు జగనన్న మన ముఖ్యమంత్రి గా కొనసాగడం ఖాయం అన్నారు.
మండల వ్యవసాయం సలహా చైర్మన్ ఐనాల బ్రహ్మజీ ఆద్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించగా సభకు అధ్యక్షత వహించిన ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు,జడ్పీటీసీ బొర్రా సత్యవతి, వైస్ ఎంపీపీ కూసంపూడి కనకదుర్గరాణి,రాష్ట్ర హౌసింగ్ డైరక్టర్ గంటా సంధ్య, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరక్టర్ నంబూరి శ్రీదేవి, మాజీ జడ్పీటీసీ సభ్యులు చెన్నంశెట్టి కోదండరామయ్య ప్రసంగించారు.
తొలుత గ్రామంలో దివంగత నేత డాక్టర్ వై.స్. రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం అక్కచెల్లమ్మలకు 14 కోట్ల రూపాయలు చెక్కును డ్వాక్రా బుక్ కీపర్లులకు అందజేశారు.
ఈకార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ శోభనబాబు, ఏపీయం రాజ్ గోవింద్, సర్పంచ్ లు మోకా లక్ష్మి, ఆండ్రాజు రత్నమణి, ముత్తిరెడ్డి సత్యనారాయణ,బత్తిన ఉమామహేశ్వరరావు, నరహరశెట్టి నరసయ్య, తిరుమలశెట్టి జ్యోతి, గద్దె ఆనంద్, గండికోట ఏసుబాబు, పీఏసీఎస్PACS అధ్యక్షులు, పోనిపిరెడ్డి శ్రీనివాసరావు, సాగి సూర్యనారాయణరాజు, ఊర కళ్యాణి, అంకెం నరసయ్య, ఎంపీటీసీలు మహ్మద్ చాన్ బాషా,,సవాకుల పద్మ, గోదావరి సత్యనారాయణ, ఇమ్మానేని లక్ష్మణరావు, నడకుదిటి రాంబాబు,,నాయకులు నున్న కృష్ణబాబు, పామర్తి సత్యనారాయణ, కొల్లాటి సత్యనారాయణ,మోకా రామకృష్ణ, తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యం, దాసి ఏసుబాబు, షేక్ చాన్ బాషా , పామర్తి సత్యనారాయణ,ఊర శ్రీధర్ , బొమ్మిడి ధనరాజు, కోకా సుజాత,, సాగి వాసురాజు,తిరుమాని రమేష్, ముద్దం రామకృష్ణ, కోకా ఏకో నారాయణ, పోకల శ్రీను, నడకుదిటి రాధాకృష్ణ, గంటా కోటేశ్వరరావు,రేవు నరసింహరావు,కొల్లాటి నాగరాజు, సత్యనారాయణ, దాసరి రాజు, రాము, వార్డ్ మెంబెర్స్ , డ్వాక్రా అక్కచెల్లమ్మలు, సీసీలు, వీయంబీకే లు, తదితరులు పాల్గొన్నారు.