Breaking News

వై.ఎస్.ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్వా సంఘాలకు రెండువ విడతగా బ్యాంక్ లలో నగదు జమ…

-పశ్చిమ నియోజకవర్గములో జరిగిన వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలలో పాల్గొన్న
దేవాదాయ శాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
2వ విడత వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలలో భాగంగా బుధవారం పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని 54, 55 మరియు 56వ డివిజన్లకు సంబందించి గాంధీ బొమ్మల సెంటర్ ఉర్దూ హై స్కూల్ మరియు 51, 53 డివిజన్ లకు సంబందించి వాటర్ ట్యాంక్ కొత్తపేట నందు నిర్వహించిన రెండోవ విడత ఆసరా సంబరాలలో రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పాల్గొని స్వయం సహాయక సంఘాల వారికీ చెక్కును అందజేసారు.

54వ డివిజన్ నందు 75 గ్రూప్ లకు రూ. 31,97,470/-, 55వ డివిజన్ నందు 117 గ్రూప్ లకు రూ. 53,38,470/-, 56వ డివిజన్ నందు 130 గ్రూప్ లకు రూ. 78,66,373/-, మరియు 51వ డివిజన్ నందలి 184 గ్రూప్ లకు రూ. 1,52,90,131/, 53వ డివిజన్ నందు 80 గ్రూప్ లకు రూ. 81,36,395/- వెలసి మొత్తం 586 స్వయం సహాయక సంఘాల వారికీ రూ. 3,98,28,839/- చెక్కును అందించారు.

అదే విధంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7 మరియు 8 డివిజన్లకు సంబందించి మొగల్రాజపురం బోయపాటి శివరామకృష్ణ మున్సిపల్ హై స్కూల్ నందు నిర్వహించిన వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలలో తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్లతో కలసి 370 గ్రూపులకు రూ. 3,20,45,978/-రూపాయలు చెక్కును అందించుట జరిగింది.

కార్యక్రమంలో వై.సి.పి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్లతో పాటుగా పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, సి,డి.ఓ లు దుర్గ ప్రసాద్, శ్రీనివాస్ మరియు యు.సి.డి క్షేత్ర స్థాయి సిబ్బంది, వైఎస్సార్ సీపీ శ్రేణులు, పొదుపు సంఘాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *