-జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర ప్రజలకు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో అందరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి అనుగ్రహం తో రాష్ట్రంలో అవినీతి, అప్పుల, అరాచక పాలన పోయి ప్రజలకు మంచి పాలన రావాలని ప్రార్ధిస్తున్నానని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ తెలిపారు