-ఎమ్మేల్యే దూలం నాగేశ్వరరావు
మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
దవంగత మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమంలో చెరగని ముద్ర వేసుకోగా ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి దాన్ని పదింతలు పదిలపరిచి అమలు పరుస్తూ పేదల కుటుంబాల్లో ప్రతిరోజు సంబరాలు తెచ్చారని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు.
మండవల్లి మండలానికి సంబందించిన రెండో విడత వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని కైకలూరు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోగురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మేల్యే దూలం నాగేశ్వరరావు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మహానేతకు తనయునిగా ఈ రోజు దేశం గర్వించదగ్గ స్థాయిలో సుపరిపాలనను అందిస్తున్న ఘనత సీయం జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ ఈ రోజు అక్కచెల్లమ్మల కళ్లల్లో ఆనందాన్ని నింపారన్నారు. రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేనివిధంగా దళారీల వ్యవస్థను స్వస్తి చెప్పి లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. నాడు ప్రజాసంకల్ప పాదయాత్రలో అక్కచెల్లమ్మలు ఇబ్బందులు, కష్టాలను నేరుగా చూసి అధికారంలోనికి రాగానే నవరత్నాల ద్వారా అక్కచెల్లమ్మలకు సంక్షేమ పథకాలు అందించారు. అందరి ఆశీస్సులతో అత్యంత భారీ మెజార్టీతో 151 సీట్లు గెలుసుకొని,అధికారంలోకి వచ్చిన మరు క్షణం హామీలను అమలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ అవినీతికి తావులేకుండా వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ స్థాపించి, అర్హులు అయిన ప్రతి అక్కచెల్లమ్మలకు పధకాలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు. ఈ రోజు కేవలం మన కైకలూరు నియోజకవర్గనికి 46,76,54,896 కోట్ల రూపాయలు వైఎస్సార్ ఆసరా 2విడత డబ్బులు 53010 కుటుంబాలకు లబ్దిని కూర్చగా, మండవల్లి మండలంలో 1008 గ్రూపుల్లోని 11088 మంది సభ్యులకు రూ.9.73కోట్లు అందించారన్నారు. వైయస్సార్ సంపూర్ణ పోషణ,జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, జగనన్నవిద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వై.ఎస్.ఆర్ చేయూత, కాపునేస్తం, ఈ బీసీ నేస్తం, వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక వంటి సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా కులమతాలుకు అతీతంగా అందిస్తున్నారన్నారు.
సభకుఅధ్యక్షత వహించిన ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి జగనన్న అన్నమాటను ఎలా పోషిచుకుంటున్నారో జగనన్న మాటను అక్షరాలా అమలుచేసే శాసనసభ్యులు డిఎన్ఆర్ బాటలో నడవడం మనందరి బాధ్యతన్నారు. మహిళలు నిజంగా సంబరాలు జరుపుకునే సందర్భం దసరా సంబరాలకు మరింత శోభను తెచ్చాయన్నారు. ఈ సందర్బంగా డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
కార్యక్రమంలోమండల వైసీపీ కన్వీనర్ గుమ్మడి వెంకటేశ్వరరావు,రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరక్టర్ గంటా సంధ్య, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరక్టర్ నంబూరి శ్రీదేవి, వైస్ ఎంపీపీ ఆగస్తీ ఆదివిష్ణు, మండవల్లి మండల వ్యవసాయం సలహా చైర్మన్ జంగం వరలక్ష్మి,ఇంగిలిపాక లంక ఎంపీటీసీ సభ్యురాలు మోరు వెంకటరమణ, భైరవపట్నం సర్పంచ్ పొనుగుమాటి సామ్రాజ్యవాణి, ముంగర మల్లికార్జునరావు, బేతపూడి రాజు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు,ఘంటసాల భాగ్యలక్ష్మి, సైదు ఎస్తేరురాణి, తలారి ధనలక్ష్మి, జంపన వీరబాబు, బోనం శేషగిరి, బూర్ల బోగేశ్వశ్రరావు,ముంగర నాగరాజు,,ఎంపీటీసీలు,సువ్వారి పద్మావతి, జయమంగళ లక్ష్మి, దార రమేష్, చిన్ని శ్రీకిష్ణ, చాట్రాగడ్డ నాగరాణి, నాగదేసి కిరీటిరాజు,గూడపాటి ఝాన్సీ, కమ్మదన నయనబాబు,, MS ప్రెసిడెంట్ బుంగా రాణి,,నాయకులు,పుట్టి సత్యనారాయణ, పెద్దిరెడ్డి శ్రీనివాస్,జయమంగళ వీరాజు, సైదు యేసు,బొమ్మనబోయిన ప్రసాద్,ఇంటి నాగరాజు,తలారి హన్నిబాబు, ఏరియా కోఆర్డినేటర్శోభన్ బాబు ఏపీయంలు సత్యనారాయణ, ఎడ్వార్డ్ పెద్ద ఎత్తున డ్వాక్రా అక్కచెల్లమ్మలు, సీసీలు వీవో ప్రెసిడెంట్లు, వీయంబీకేలు తదితరులు పాల్గొన్నారు.