Breaking News

మహిళల ఆర్థిక స్వావలంభనే ప్రభుత్వ లక్ష్యం…

-పామర్రు మండలంలో 1081 సంఘాల్లోని 10936 మంది సభ్యులకు రూ. 9.53కోట్లు పంపిణీ..
-శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్

పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :

మహిళల ఆర్థిక స్వావలంబనతోనే సమాజాభివృద్ది జరుగుతుందని,ఆదిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ అన్నారు.
వైఎస్సార్ ఆసరా రెండో విడత పంపిణిలో భాగంగా గురువారం స్థానిక ఆస్సీసీ ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి ఎమ్మేల్యే అనిల్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మహిళా అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారన్నారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసమే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మహిళా సాధికారతను నిర్లక్ష్యం చేస్తే నేడు సీయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆచరణలో చేసి చూపిస్తోదన్నారు. పామర్రు మండలంలో 1081 డ్వాక్రా సంఘాల్లోని 10936 మంది సభ్యులకు రూ. 9.53 కోట్లు నేరుగా మహిళల ఖాతాల్లోనే జమచేస్తున్నారు. నేడు పామర్రు తో పాటు మరికొన్ని గ్రామాలకు సంబందించి రెండో విడత వైఎస్సార్ ఆసరా పధకం ద్వారా 584 స్వయం సహాయక సంఘాలకు రూ.4.92 కోట్లు చెక్కును పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీయం జగన్మోహన్ రెడ్డి నాడు పాదయాత్రలో మహిళలకు, కార్మికులకు, విద్యార్థులకు, చిన్నచిన్న చేతి వృత్తుల పనివార్లకు ఇచ్చిన హామీలన్నింటినీ ఈ రెండున్నఏళ్లలోనే దాదాపు నెరవేర్చారన్నారు. సీయం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు కొన్ని పత్రికలు, టీవి ఛానల్స్ ను అడ్డుపెట్టుకుని అభివృద్దేలేదంటూ విమర్శించడం సరిగాదన్నారు. సమాజంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందించే వారి పిల్లలను చదివించుకుని మంచి పౌరులుగా తీర్చదిద్దుతారన్నారు. వైఎస్సార్ చేయూత కొన్ని సంస్థలతో ఒప్పదం కుదుర్చుకుని చిన్నచిన్న వ్యాపారాలు చేసే దిశగా ప్రభుత్వం మహిళలను ప్రోత్సహిస్తుందన్నారు. నవరత్నాల్లో భాగంగా నాడు-నేడు ద్వారా పాఠశాలు, ఆస్పత్రులు ఆదునీకరణ, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, విద్యాదీవెన, వసతిదీవేన వంటి అనేక సంక్షే పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తున్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన డ్వాక్రా మహిళలు సీయం జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ దాసరి అశోక్ కుమార్, జడ్పీటీసీ కూనపరెడ్డి స్వరూపారాణి ప్రసంగించగా కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆరేపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్ కేతావతు కస్తూరి, ఉపసర్పంచ్ దేవిరెడ్డి బాలవెంకటేశ్వరరెడ్డి, ఏరియా కోఆర్డేటర్ సుందరరావు, ఏపీయం ప్రధానరావు, డ్వాక్రామహిళలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *