విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేసారు. నవరాత్రి వేడుక ధర్మం యొక్క ఔనత్యాన్ని వెల్లడిస్తుందని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా వేడుకలను జరుపుకుంటున్నామని వివరించారు. రాష్ట్ర ప్రజలందరికీ కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు అందించాలని వేడుకుంటున్నానన్నారు. కరోనా ప్రవర్తనా నియమావళిని పాటించటం ద్వారా పండుగ వేడుకలను జరుపుకోవాలని గవర్నర్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ముఖ ముసుగు ధరించటంతో పాటు, సామాజిక దూరం పాటిస్తూ క్రమం తప్పకుండా చేతులు శుభ్రపరుచుకోవాలన్నారు. వైరస్ నుండి రక్షణ కల్పించే టీకాలు అందుబాటులో ఉన్నందున అర్హులైన వారందరూ కోవిడ్ -19 వ్యాక్సిన్ ను అశ్రద్ధ చేయకుండా తీసుకోవాలని గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ కోరారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …