Breaking News

హంసవాహన తెప్పోత్సవ కార్యక్రమానికి సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హంసవాహన తెప్పోత్సవ కార్యక్రమానికి సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు.
దుర్గా ఘాట్ ఇరిగేషన్ మోడల్ గెస్టుహౌస్లో గురువారం ఇరిగేషన్ , టూరిజం, రెవిన్యూ, పోలీస్, ఫైర్, మత్స్యశాఖ అధికారులతో తెప్పోత్సవం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జె. నివాస్ సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణానదిలో నీటి సామర్ధ్యం ఎక్కువగా ఉన్నందున ఈ ఏడాది దుర్గాఘాట్లోనే నిలకడగానే ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దుర్గాఘాట్లో పరిమితి సంఖ్యలో ప్రొటోకాల్ ప్రకారం ప్రత్యేక పాన్లను జారీ చేయలన్నారు. ఉత్సవ విగ్రహాలను నగరంలోని ఒమౌస్ నుండి ఊరేగింపుతో హంసవాహనం పైకి తీసుకువచ్చే సమయంలో పోలీస్ అధికారులు ప్రత్యేక రోజార్టీతో ఏర్పాట్లు చేయాలన్నారు. సాయంత్రం 5.30 గంటల కల్ల హంసవాహనంపై ఉత్సవ విగ్రహాల పూజ కార్యక్రమాలు ప్రారంభం కావాలని కలెక్టర్ ఆలయ అధికారులను కోరారు. దుర్గాఘాట్ నుండి హంసవాహనం పైకి ఉత్సవ విగ్రహాలను తీసుకువెళ్లేటప్పుడు ఫంట్ పై మెట్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. దూరదర్శన్ తెప్పోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తుందన్నారు. ఒకేసారి ఫ్రెండ్స్ పైకి విఐపిలు వెళ్లకుండా ప్రొటోకాల్ ప్రకారం దర్శించుకునేలా చూడాలన్నారు. విద్యుత్ అలంకరణ షాట్ సర్క్యూట్ కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారన్నారు. దుర్గాఘాట్లో ప్రత్యేక పాన్లు జారీ చేయాలని , కృష్ణానదిలో గజ ఈతగాళ్లతో గస్తీ బోట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
నగర పోలీస్ కమీషనర్ బి. శ్రీనివాసులు మాట్లాడుతూ ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతున్న సమయంలో కనకదుర్గా ఫ్లై ఓవర్ పై ఎటువంటి ట్రాఫిక్ లేకుండా చూడాలని, ప్రకాశం బ్యారేజిపై ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారన్నారు.
తొలుత దుర్గాఘాట్లో హంసవాహనంపై జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె.నివాస్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు కె. మాధవీలత, ఎస్. శివశంకర్, కె. మోహన్‌కుమార్, మున్సిపల్ కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్, సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్, ఆలయ ఇవో డి. భ్రమరాంబ వివిధ శాఖలు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *