విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దసరా పండుగ సందర్భంగా ఊరు ఊరు కో జమ్మిచెట్టు గుడి గుడి కో జమ్మిచెట్టు కార్యక్రమంలో భాగంగా విజయదశమి పర్వదినాన విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి జమ్మిచెట్టు ను నాటారు. విశాఖ శ్రీ శారదాపీఠంలో విజయదశమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.దసరా పర్వదినాన శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు విజయదుర్గ అవతారంలో దర్శనమిచ్చింది. షడ్భుజి రూపంలో అమ్మవారి అవతారాన్ని అలంకార భట్టర్లు తీర్చిదిద్దారు. రుద్రాక్షమాల, కమండలం, శూలం, ఢమరుకం, శంఖుచక్రాలు, పాశాంకుశాలు చేతపట్టి భక్తులను అనుగ్రహించింది అమ్మవారు. విజయదశమి పర్వదినాన విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి జమ్మిచెట్టును నాటారు.
Tags Visakhapatnam
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …