విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
షిర్డీ సాయినాధుని యొక్క 103 వ పుణ్యతిధి మహోత్సవ సందర్భముగా ముత్యాలంపాడు శ్రీ షిర్డీ సాయిబాబా మందిరములో శనివారం ఘనంగా పుణ్యతిధి మహోత్సవ వేడుకలు జరిగాయి. అందులో భాగముగా శనివారం ఉదయం బాబా వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం షిర్డీలో బాబా వారు 1918 వ సంవత్సరములో మధ్యాహ్న సమయంలో ఏకాదశి ఘడియల్లో సుమారు 2 గంటల 30 నిమిషములకు సమాధి చెందిన విషయం మనకు చరిత్ర ద్వారా అవఘతమవుతున్నది అదేవిధముగా ఈ రోజు ఏకాదశి ఘడియలు మధ్యాహ్నం 1 గంట నుండి విశేషమైన సంకీర్తన జరిగి సరియగు 2 గంటల 30 నిమిషములకు బాబా వారి సమాధి నమూనాని పూలతో అలంకరించి సమాధి దగ్గర విశేషముగా సంకీర్తన చేసి స్వామి వారికి ప్రీతీకరమైన నివేదనలు చేసి, హారతి ఇచ్చి సద్గురు సాయినాధుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడానికి భక్తులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో మందిర గౌరవాధ్యక్షులు పి. గౌతమ్ రెడ్డి , అధ్యక్ష కార్యదర్శులు ఇతర సభ్యులు, సాయి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ విశేషమైన కార్యక్రమములో భాగముగా సాయంత్రం సహస్ర దీపాలంకరణ మహోత్సవ కార్యక్రమము కూడా జరిగింది. ఏకాదశి సందర్భముగా ఉదయము నుంచి రాత్రి వరకు కూడా ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి అను నామ సంకీర్తన జరిగింది. మందిర గౌరవాధ్యక్షులు మాట్లాడుతూ షిర్డీ సాయి బాబా మందిరములో ఆధ్యాత్మిక కార్యక్రమములతో పాటుగా పలు సామాజిక కార్యక్రమములు కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. బీద వారికి దుప్పట్ల పంపిణి అదేవిధముగా ప్రతి రోజూ కూడా నిత్యాన్నదానం, సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజులు చెల్లించడం, కరోనా విపత్కర సమయంలో కూడా రోజుకు 2000 మందికి అన్నదానం చేయడం జరిగిందని చెప్పారు. ఈ రోజు బాబా వారి 103 వ పుణ్యతిధి మహోత్సవములు అత్యంత వైభవముగా జరిగిందన్నారు. 2022 వ సంవత్సరం జనవరి 1వ తేదీన జరగబోవు లక్ష కేజీల బియ్యం కార్యక్రమము గురించి అందుకు సంబంధించిన వివరాలు తెలియచేసారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …