-అను హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ డాక్టర్ జి.శ్రీదేవి
-ఘనంగా అను ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ మూడవ వార్షికోత్సవం
-వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్డియాక్ హెల్త్ చెకప్ ప్యాకేజీల ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అను హాస్పిటల్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎనికేపాడులో నిర్వహింపబడుతున్న అను ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ నందు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అందిస్తున్నామని అను హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీదేవి పేర్కొన్నారు. అను ఇనిస్టిట్యూట్ మూడవ వార్షికోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం డాక్టర్ శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ న్యూరో, కార్డియాక్ విభాగాలకు సంబంధించి అత్యున్నత సేవలను అందించాలనే లక్ష్యంతో అను ఇనిస్టిట్యూట్ పనిచేస్తోందని అన్నారు. అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అధునాతన సాంకేతిక వ్యవస్థతో అను ఇనిస్టిట్యూట్ అద్భుత ఫలితాలను సాధిస్తోందని తెలిపారు. ఈ మూడేళ్ల ప్రస్థానంలో పలు క్లిష్టమైన కేసులకు చికిత్స అందించామని, అనేక అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించగలిగామని అన్నారు. ఈ మైలురాయిని అధిగమించడం వెనుక అను ఇనిస్టిట్యూట్ వైద్య బృందం కృషి, సిబ్బంది సహకారం మరువలేనివని డాక్టర్ శ్రీదేవి వెల్లడించారు. అను ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్డియాక్ హెల్త్ చెకప్ ప్యాకేజీలను ఆవిష్కరించనట్లు ఆమె ప్రకటించారు. ఈ ప్రత్యేక ప్యాకేజీల్లో భాగంగా అతి తక్కువ ఖర్చుతో గుండెకు సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలను చేయించుకోవచ్చని వివరించారు. ప్రత్యేక కార్డియాక్ హెల్త్ చెకప్ ప్యాకేజీలకు సంబంధించిన బ్రోచరును ఈ సందర్భంగా డాక్టర్ శ్రీదేవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అను ఇనిస్టిట్యూట్ వైద్యులు డాక్టర్ తీగల రమేష్, డాక్టర్ నవీన్ తోట, డాక్టర్ నరాలశెట్టి అనిల్ కుమార్, డాక్టర్ ఎస్. కిరణ్ కుమార్ పాల్గొన్నారు.