-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు
కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆసరా సంబరాలను పెద్దఎత్తున విజయవంతం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచెప్పిన కైకలూరు నియోజకవర్గ అక్కచెల్లమ్మల రుణం ఎప్పటికి తీర్చుకోలేనిదని, ఇదే ఆప్యాయత, అభిమానం మీ నుండి కోరుకుంటూ మీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు.
సోమవారం కలిదిండి మండలం తాడినాడ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా రెండోవ విడత కార్యక్రమానికి ఎమ్మేల్యే డిఎన్ఆర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భేంగా ఆయన మాట్లాడుతూ ముందుగా కలిదిండి మండల అక్కచెల్లమ్మలకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఈ రోజు తాడినాడ అల్లూరి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతం చేసిన మీ అందరికి పేరుపేరునా ధన్యవాదములున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న మనకి ఇచ్చిన మాట ప్రకారం 4విడతలలో 26 వేల కోట్ల రూపాయలు అక్కచెల్లమ్మలకు డ్వాక్రా రుణమాఫీ చేయాలని చెప్పిన తేదీ ప్రకారం ఈ రోజు కేవలం కైకలూరు నియోజకవర్గానికి 46,76,54,896 కోట్ల రూపాయలు ఋణమాఫి జరిగిందన్నారు. దానిలో భాగంగా కలిదిండి మండలనికి వైఎస్సార్ ఆసరాగా రెండోవ విడత రూ. 14 కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చాయన్నారు. వైఎస్. జగనన్న రాష్ట్రంలో పేద, మధ్య తరగతి అక్కచెల్లమ్మలకు ప్రతి సంక్షేమ పధకం నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాలో వేస్తున్నారు. ఎక్కడ కూడా అవినీతికి తావులేకుండా వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, స్థాపించి రాష్ట్రంలో ప్రజలకు పరిపాలన నేరుగా అందిస్తున్నారన్నారు. అర్హులు అయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పధకాలను అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థలలో మీరు అందరు కూడా జగనన్న సైనికులకు ఓట్లు వేసి గెలిపించారన్నారు. మీ రుణం నేను, ప్రజాప్రతినిధులు ఎప్పటికి తీర్చుకోలేమన్నారు. కానీ రుణం తీర్చుకునే ప్రయత్నం తుది వరకు చేస్తానని ప్రమాణం చేస్తున్నానన్నారు. ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని నిలుపుతూ మీరంతా.. నేను నిలబెట్టిన అన్నదమ్ములకు, అక్కచెల్లమ్మలకు ఓట్లు వేసి గెలిపించారని, రాబోయే రోజులలో మీ అందరి ఆశీస్సులతో జగనన్న మరింత సంక్షేమ కార్యక్రమాలు చేస్తారని, మరో ఇరవై ఇరవయ్యయిదేళ్లు జగనన్న మన ముఖ్యమంత్రి గా కొనసాగడం ఖాయం అన్నారు. వేదికపై చిన్నారులు ప్రదర్శించిన మహిషాసురమర్ధని కూచిపూడి నృత్యరూపకం సభికుల్ని విశేషంగా అలరించింది. అనంతరం అక్కచెల్లమ్మలకు రూ.14 కోట్ల రూపాయలు చెక్కును డ్వాక్రా బుక్ కీపర్లులకు అందజేశారు.
కార్యక్రమంలో కైకలూరు జడ్పీటీసీ కురేళ్ళ బేబీ, మండవల్లి వైస్ ఎంపీపీ ఆగస్తీ అదివిష్ణు, మండల వ్యవసాయ సలహా చైర్మన్ ఐనాల బ్రహ్మజీ మాట్లాడిన అనంతరం, తాడినాడ ప్రముఖులు,అల్లూరి సూర్యనారాయణరాజు,సాగి చిన్నబ్బాయిరాజు, కుసంపూడి సత్తులురాజు తాడినాడ నాయకులు ఎమ్మెల్యే డిఎన్ఆర్ కు గజ పూలమాలలు వేసి శాలువాలు కప్పి సన్మానించారు. డ్వాక్రా అక్కచెల్లమ్మల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తాడినాడ కార్యక్రమం విజయవంతం చేసిన,తాడినాడ ప్రముఖులు అల్లూరి సూర్యనారాయణరాజు దంపతులకి, అల్లూరి విజయలక్ష్మి బాల, సాగి చిన్నబ్బాయిరాజుదంపతులకి, పెనుమత్స ఏడుకొండలురాజుకి,పెనుమత్స రామకృష్ణంరాజుకి, పెనుమత్స బాబ్జి, పెనుమత్స మౌనికదేవి, నంబూరి రామకృష్ణంరాజు, రుద్రరాజు రామకృష్ణంరాజు, జమ్ము సురేష్,నడింపిల్లి శివాజీరాజు, నంబూరి శ్రీనివాసరాజుకు ఎమ్మేల్యే శాలువా కప్పి పూలమాలలు వేసి సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈకార్యక్రమంలో ఎంపీడీఓ పార్ధసారధి, ఏరియా కోఆర్డినేటర్ శోభనబాబు, ఏపీయం రాజ్ గోవింద్, సర్పంచ్ లు తాడి శ్రీనివాసరావు,సాన మీనా సరస్వతి, బత్తిన ఉమామహేశ్వరరావు, నరహరశెట్టి నరసయ్య, అనపర్తి వడ్డికాసులు, తిరుమలశెట్టి జ్యోతి, గద్దె ఆనంద్,గండికోట ఏసుబాబు, గొర్ల వరలక్ష్మి, నున్న రాజేశ్వరమ్మ, ద్రోణాద్రి నాగలక్ష్మి,బొర్రా వెంకటలక్ష్మి,మహాదేవ విజయబాబు, శీలం రామకృష్ణ,, చెన్నంశెట్టి నాగరాజు,డీసీయంఎస్డైరక్టర్ దాసి సరోజినీబాయ్, ఎంపీటీసీలు నీలి సుమన్,పేటేటి రామకృష్ణ,మహ్మద్ చాన్ బాషా,చెన్నంశెట్టి శిరీష,సవాకుల పద్మ, నరహరశెట్టి జయలక్ష్మి, టెక్కిం శ్యామ్, గోదావరి సత్యనారాయణ, ఇమ్మానేని లక్ష్మణరావు, నడకుదిటి రాంబాబు,నంద్యాల ఏడుకొండలు, కట్టా నాగలక్ష్మి,పీఎసీఎస్ అధ్యక్షులు నామాని అన్నవరం, కురేళ్ళ రాజారత్నం, పోనిపిరెడ్డి శ్రీనివాసరావు, నాయకులు బొర్రా ఏసుబాబు,నంబూరి బాబీ,పోసిన రాజీవ్ భరత్, నున్న కృష్ణబాబు, కొల్లాటి సత్యనారాయణ, మోకా రామకృష్ణ, దాసి ఏసుబాబు,చిట్టూరి వాసు,సాన వెంకటరామారావు, గొర్ల వెంకటేశ్వరరావు, బత్తిన సుబ్బారావు,,పామర్తి సత్యనారాయణ,కోకా ఏకోనారాయణ, సాగి వాసురాజు, చుండూరి లక్ష్మి,గాదిరాజు కిట్టు, గంటా కోటేశ్వరరావు,పెనుమత్స నాగరాజు,షేక్ చాన్ బాషా, కందుల వెంకటేశ్వరరావు, మందా నవీన్ , ఏపీయంలు సత్యనారాయణ,తిరుపతయ్య, పెద్ద ఎత్తున డ్వాక్రా అక్కచెల్లమ్మలు,C. C.లు, VOAలు,నాయకులు కార్యకర్తలు,,తదితరులు పాల్గొన్నారు.