Breaking News

పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రత పాటించాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్ల పై ఎక్కడ పడితే అక్కడ చెత్త వెయ్యకుండా పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రత పాటించాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విజ్ఞప్తి చేశారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా దొమ్మేరు, అరికిరేవుల , కుమారదేవం, నందమూరు, తొగుమ్మి , వేములూరు, వాడపల్లి , ఐ. పంగిడి గ్రామాలకు పంపిన చెత్త సేకరణ ఆటోలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ పట్టణాలను గ్రామాలని పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత పారిశుధ్య కార్మికులపైన ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక స్వచ్ఛ సంకల్పంతో క్లాప్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కూడ మూడు ప్లాస్టిక్ డస్ట్ బిన్ లు తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర వ్యర్ధాలు వేర్వేరుగా సేకరించడానికి ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. సామాజిక బాధ్యత ను ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ప్రవర్తించాల్సి ఉందన్నారు. ఇంటికి చెత్త సేకరణ కి వొచ్చే వ్యక్తి కి తడి, పొడి చెత్తలను విడి విడిగా అందచెయ్యలన్నారు. స్వచ్చ సంకల్ప కార్యక్రమం ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందని మంత్రి తెలిపారు. సేకరించిన చెత్తను సాగ్రిగేట్ చేసేందుకు రాష్ట్రంలో 231గార్బెజ్ ట్రాన్సఫర్ స్టేషన్లు ఏర్పాటు చేసి అక్కడకి తరలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎంపిపి కాకర్ల నారాయుడు, డీఎల్. డి ఓ/ఎండిఓ పి. జగదాంబ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *