ఏలూరు / కొవ్వూరు / జంగారెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సి కమిషన్ ఛైర్మన్ ఎమ్. విక్టర్ ప్రసాద్ అక్టోబర్ 20 వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మ. 12.30 కి కొవ్వూరు చేరుకుంటారని ఏపీరాష్ట్ర షెడ్యూల్డ్ తరగతుల కమిషన్ కార్యాలయం మంగళవారం పర్యటన సమాచారాన్ని తెలియపరిచారు. అనంతరం మ.2.00 గంటల వరకు అధికారులతో సమావేశం నిర్వహించి, స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నారు. తదుపరి కొవ్వూరు నుంచి బయలుదేరి జంగారెడ్డిగూడెం మండలం లోని శ్రీనివాసపురం గ్రామం కి మ.3 కి చేరుకుంటారు. మ 3 నుంచి 6 గంటల వరకు శ్రీనివాసపురం గ్రామంలో ని ఎమ్. రాజు మృతి కి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించడం జరుగుతుంది. అక్కడ నుండి సా.6 కి బయలుదేరి రాత్రి 8 గంటలకు మచిలీపట్నం చేరుకుంటారు.
Tags kovvuru
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …