-పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు
-ఇన్ ఛార్జ్ కలెక్టరు డా. కె. మాధవిలత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 21వ తేదీన విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ఇన్ ఛార్జ్ కలెక్టరు డా. కె. మాధవిలత తెలిపారు.
21వ తేదీన ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేదిక ఏర్పాటు కార్యక్రమానికి సంబంధించిన పనులను నగర పోలీస్ కమిషనరు బత్తిన శ్రీనివాసులు ఇన్ ఛార్జ్ జిల్లా కలెక్టరు డా. కె.మాధవిలత సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పరిశీ లించారు. అనంతరం పోలీస్ కమిషనరు మాట్లాడుతూ విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమరవీరులను స్మరించుకునేందుకు ప్రతీ ఏడాది అక్టోబరు 21వ తేదీన సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి హాజరై పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖామంత్రి మేకతోటి సుచరిత రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ తోపాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని అమరవీరుల కుటుంబసభ్యులు కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. కోవిడ్ కారణంగా అనేకమంది పోలీస్ అధికారులు సిబ్బంది మృతిచెందడం బాధాకరమన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని అందజేయనున్నదని మృతిచెందిన 10 మంది పోలీసు కుటుంబాల కుటుంబసభ్యులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ఆర్ధిక సహాయాన్ని లాంఛనంగా అందించడం జరుగుతుందని బత్తిన శ్రీనివాసులు తెలిపారు.
జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టరు మాధవిలత మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడుతూ విధినిర్వాహణలో అశువులు బాసిన అమరవీరులను స్మరించుకునే బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమిష్టి కృషితో పనిచేయాలన్నారు. కార్యక్రమానికి సంబంధించిన పనులను బుధవారం సాయంత్రానికి పూర్తి చేయడానికి సన్నద్ధం చేయాలని ఆమె తెలిపారు. ఏర్పాట్ల పరిశీలనలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ఏసిపి హర్షవర్ధన్ సబ్ కలెక్టరు యస్ యస్. ప్రవీణ్ చంద్ వివిధ శాఖల అధికారులు పలువురు పోలీస్ అధికారులు ముఖ్యమంత్రి భద్రతా అధికారులు పాల్గొన్నారు.