Breaking News

అదుపులోనే అతిసార…

-తగ్గేవరకు వ్తెద్యశిబిరాల కొనసాగింపు
-మాంసాహారం కొద్దిరోజులు మానండి.
-పరిసరాలు శుఁభంగా ఉంచండి
-డి.ఎం.అండ్ హెచ్ .ఓ ఎం. సుహాసిని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ఎనికేపాడు గ్రామ పంచాయతీ ఏరియాలో ఎస్వీఅర్ కాలనీలో వచ్చిన అతిసార వ్యాధి వ్యాప్తి చెందిన వార్త వ్యాపించడంతో ఆ ప్రాంతాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయ అంటువ్యాధుల బృందంతో కలసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డా.మాచర్ల సుహాసిని తనిఖీ చేసి ఆ ఏరియా పరిసరాలు పర్యటించి వ్యాధిగ్రస్తులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఏరియాలో అతిసార వ్యాధి పూర్తి అదుపులోనే ఉన్నదని ఈ రెండు రోజుల్లో వచ్చిన కేసులన్ని పూర్తిగా నయం కావటం జరిగిందని, ఈ ఏరియాలో ప్రజలు త్రాగుతున్న మంచి నీటిని పూర్తి విశ్లేషణకు నీటి స్వచ్ఛతా పరీక్షా లాబ్ (IPM)హెడ్ వాటర్ వర్క్స్, విజయవాడకు పంపించడం జరిగిందని, ప్రజలు వారి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వేడి,వేడి ఆహార పదార్ధాలు మాత్రమే తీసుకోవాలని, పరిస్థితి పూర్తి అదుపులోకి వచ్చేటంత వరకు శాకాహారమే తీసుకోవాలని తెలియజేశారు. పూర్తి అదుపులోకి వచ్చేటంత వరకు ఆరోగ్య శిబిరం కొనసాగుతుందని తెలియజేశారు. బ్లీచింగ్,ఫాగింగ్ రహదారులు, కాలువల వెంట చల్లాలని సర్పంచ్ ను ఆదేశించారు. కాచిచల్లార్చిన నీరు ఁతాగాలని చాటింపు వేయాలని తెలిపారు. ఈ పర్యటనలో ఆమెతో పాటు జిల్లా అంటువ్యాధుల బృందం అధికారి పి.సుకుమార్, రామకృష్ణ, అద్దంకి శ్రీనివాసరావు, కాశీమ్, బూర రాజశేఖర్, ఉప్పులూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. సుందర్ కుమార్, డా. పావని, ఏపీడమాలజిస్ట్ డా. శ్రుతి మౌనిక పంచాయతీ సర్పంచ్ రాచమళ్ల పూర్ణచంద్రరావు, సెక్రటరీ కృపా కుమార్, EORD శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *