Breaking News

రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి… : మల్లాది విష్ణు 

-నీచ సంస్కృతికి మర్రి విత్తనం చంద్రబాబు…
-టీడీపీ బంద్ కు సొంత పార్టీ నేతలే దూరం
-ఫ్రస్ట్రేషన్‌ లో ఎంత నీచానికైనా దిగజారుతారా..? : ఎమ్మెల్సీ కరీమున్నీసా
-అంపశయ్యపై ఉన్న పార్టీని బ్రతికించుకునేందుకు చంద్రబాబు దుష్ట రాజకీయాలు : పూనూరు గౌతమ్ రెడ్డి
-టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల శాంతియుత నిరసనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాలలో నీచమైన భాష, పదజాలానికి అంకురార్పణ చేసిందే తెలుగుదేశం పార్టీ అని.. దానిని మేము కేవలం ప్రతిఘటించామని మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై తెలుగుదేశం నాయకుల అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు శాంతియుత నిరసనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరీమున్నీసా, APSFL చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి సహా వైసీసీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఉన్నతమైన విలువలు పాటించే గౌరవ ముఖ్యమంత్రిని విమర్శించడం బాధాకరమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు  అన్నారు. వ్యక్తుల నైతికతపై లేనిపోని దుష్ప్రచారం చేసే నీచ సంస్కృతికి చంద్రబాబు మర్రి విత్తనం లాంటివాడని మండిపడ్డారు. పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతారనేది పట్టాభి వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైందని అన్నారు. చంద్రబాబు ఒక రాజకీయ ఉగ్రవాదిగా మరి.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు దుష్ట రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేత ఇచ్చిన స్క్రిప్ట్ మేరకే పట్టాభి నీచాతి నీచంగా మాట్లాడారన్నారు. ఈ పాపం ఊరికే వదలదన్నారు.

టీడీపీ బంద్ అట్టర్ ఫ్లాప్
తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన బంద్ రాష్ట్రవ్యాప్తంగా అట్టర్ ఫ్లాప్ అయిందని మల్లాది విష్ణు  అన్నారు. ప్రజా సంఘాలు, ఏ రాజకీయ పార్టీ కూడా ఈ బంద్ కు మద్ధతు తెలపకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. చివరకు టీడీపీ నాయకులే బంద్ లో పాల్గొనలేక తమను హౌస్ అరెస్ట్ లు చేయమని కోరుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు గతంలో అమిత్ షా గారి తిరుపతి పర్యటన సమయంలో.. రాళ్లు, కర్రలతో ఆయనపై దాడి చేయించిన చంద్రబాబు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అమిత్ షా కి ఫోన్ చేస్తున్నారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో ఉంటూ ఈ రాష్ట్రంపై కుయుక్తులు పన్నుతూ.. చంద్రబాబు చేస్తున్న కుట్రలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రిపై తన చెంచాలతో అనుచిత వ్యాఖ్యలు చేయించిన చంద్రబాబు తక్షణమే రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ కరీమున్నీసా మాట్లాడుతూ.. గడిచిన రెండున్నరేళ్లలో జరిగిన ఐదు ఎన్నికలలో చావు దెబ్బతినడంతో టీడీపీ నేతల ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిందని అన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ అక్రమాలు, అరాచకాలకు తెగబడ్డారని.. కనుకనే టీడీపీని తగిన రీతిలో ప్రజలు సాగనంపారన్నారు. మళ్లీ అధికారంలోకి రాలేమన్న భయంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

APSFL చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రామ రాజ్యాన్ని నెలకొల్పితే.. చూసి భరించలేక చంద్రబాబు రాక్షస రాజకీయాలు చేస్తున్నారన్నారు. అంపశయ్యపై ఉన్న పార్టీని బ్రతికించుకునేందుకు సొంత కార్యాలయంపై దాడులు చేయించుకుని.. ఆ నెపాన్ని వైసీపీపై రుద్దాలని చూస్తున్నారన్నారు.

డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రాయలేని భాషలో దూషిస్తున్న ఇటువంటి వారిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య విలువలు కాపాడుతున్నారని.. తెలుగుదేశం నేతలు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని ఆదేశించారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పెనుమత్స శిరీష, శర్వాణి మూర్తి, బాలిగోవింద్, జానారెడ్డి, కొంగితల లక్ష్మీపతి, కుక్కల అనిత, అలంపూర్ విజయలక్ష్మి, ఎండి షాహినా సుల్తానా, కోఆప్షన్ సభ్యులు గుండె సుభాషిణి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పిల్లి క్రిష్ణవేణి, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జిలు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *