-రోటరీ నగర్ నందు కమ్యూనిటి హాల్ నిర్మాణమునకు అంచనాలు తయారు చేయాలి… – మంత్రి వర్యులు
-డివిజన్లో ప్రజల సమస్యలను పరిష్కరించేలా చర్యలు – మేయర్ రాయన భాగ్యలక్ష్మి
-45వ డివిజన్ లో పర్యటించిన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 45వ డివిజన్ నందలి పలు వీధులలో దేవాదాయశాఖ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధికారులతో కలసి పర్యటించి స్థానికంగా ప్రజలకు ఎదురౌతున్న ఇబ్బందులు మరియు సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సమస్యలపై అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. డివిజన్ పరిధిలోని అంబేద్కర్ రోడ్, రోటరీ నగర్, బాలాజీ నగర్, అండమాని భ్రమయ్య కాలనీ, తదితర ప్రాంతాలలో పర్యటిస్తూ, బాలాజీ నగర్ నందు రోడ్ వేయుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటుగా మరో మూడు క్రాస్ రోడ్లను కూడా బి.టి రోడ్లుగా అభివృద్ధి పరచుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా రోటరీ నగర్ నందలి నగరపాలక సంస్థ ఖాళి స్థలము నందు కమ్యూనిటి హాల్ నిర్మాణమునకు అంచనాలు తాయారు చేయాలని సూచించారు. డివిజన్ పరిధిలో పలు చోట్ల డ్రెయిన్లు, వాటర్ సప్లై, రోడ్లు మొదలగునవి సరిగా లేకపోవుట వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను స్థానికులు తమ దృష్టికి తీసుకురావటం జరిగిందని అన్నారు. సమస్యలను పరిశీలిస్తూ, మేము భాద్యతలు చేపట్టినప్పటి నుండి నగరాభివృద్ధి దృష్టిలో ఉంచుకొని పశ్చిమ నియోజకవర్గంలో అనేక వేల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమము చేపట్టినప్పటికి ఇంకా పలు డివిజన్ లలో ఇంకను చేపట్టవలసియున్నవని, క్రమ పద్దతి లో అన్ని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పర్యటనలో మాజీ కార్పొరేటర్ బి.సంధ్య రాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. నారాయణమూర్తి, హెల్త్ ఆఫీసర్ డా.సురేష్ బాబు, ఇతర అధికారులు సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.