అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అమలవుతున్న విద్యాపధకాల అమలు తీరును పరిశీలించేందుకు అస్సాం బృందం రాష్ట్రానికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయంలో అధికారులతో సమావేశానికి ముందుగా సచివాలయం లో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి సురేష్ ను అస్సాం బృందం సత్కరించింది. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అస్సాం బృందం రాష్ట్రంలో విద్యాకార్యక్రమాల అమలును పరిశీలించనున్నారు. అమ్మ ఒడి, నాడు నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన లాంటి పధకాలను పరిశీలించనున్నారు. రాష్ట్రానికి వచ్చిన వారిలో అస్సాం స్టేట్ సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ రోష్ని అపరంజి, ప్రాధమిక విద్య డైరెక్టర్ బిజోయా చౌదరి, ఎస్ ఈ ఆర్ టీ డైరెక్టర్ నీరదదేవి తదితరులు ఉన్నారు.
Tags amaravathi
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …