Breaking News

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఎన్నికల కమీషన్ వారి ఆదేశాల మేరకు కొవ్వూరు 23వార్డు కి సంబంధించిన కౌన్సిలర్ ఎం. రమేష్ మరణించడంతో ఏర్పడిన ఖాళీ ని భర్తీ చేసేందుకు సన్నాహాకాలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి పోలింగ్ కేంద్రాల పై ఎటువంటి అభ్యంతరాలు రాలేదని కొవ్వూరు మునిసిపల్ కమీషనర్. కె.టి.సుధాకర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కమిషనర్ వారి కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ కొవ్వూరు పురపాలక సంఘం పరిధిలో 23 వ వార్డు కౌన్సిలర్ మృతి చెందడంతో ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 20న ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. అదేవిధంగా ఓటర్ల జాబితాను కూడా ప్రకటించాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆగస్ట్ 21 న ఓటర్ల జాబితాను ప్రచురించామన్నారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు స్వీకరించేందుకు ఆక్టోబరు 22వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఇచ్చామని, ఎటువంటి అభ్యంతరాలు రాలేదన్నారు. ఈరోజు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని, సమావేశానికి హాజరుకాని వారిని ఫోనులో సంప్రదించామని, వారు కూడా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని సుధాకర్ తెలిపారు. 23 వ వార్డుకి ఎన్నికలని నిర్వహించేందుకు 23 వ తేదీన తుది నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తదుపరి ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రుత్తాల భాస్కర్ రావు, టిడిపి పార్టీ అధ్యక్షుడు చక్రధర్ రావు, బీఎస్పీ పార్టీ ఉపాధ్యక్షుడు కె. పాల్ రాజు, ఎ. చక్రధరరావు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *