-“జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం” పై క్షేత్ర స్థాయిలో సర్వే వివరాలు తెలుసుకోవడం జరిగింది..
-యంపీడీవో వెంకటరమణ
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ నియంత్రణకు 18 నుంచి 45 లోపు వారందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకొని కరోనా వైరస్ ను కట్టడి చేయాలని ఎంపీడీవో ఎ.వెంకటరణ అన్నారు. గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన “మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్” కార్యక్రమాన్ని ఎంపీపీ గద్దె పుష్ప రాణి తో కలిసి యంపీడీవో పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ పోయిందని ఎవరూ అనుకోవద్దని ప్రతి ఒక్కరూ కోవిడ్ నియంత్రణకు మాస్కులు తప్పనిసరిగా ధరిస్తూ, శానిటైజర్లు నియోగిస్తూ భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. గుడివాడ రూరల్ మండలం పరిధిలో అన్ని గ్రామ పంచాయితీల్లో ప్రజలు వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ వేస్తున్నారని, వారికి సహకరిస్తూ నూరు శాతం ప్రజలందరూ వ్యాక్సినేషన్ వేయించుకుని నూరు శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేవిధంగా సహకరించాలని కోరారు. అనంతరం దొండపాడు గ్రామ సచివాలయంలో సెక్రటరీ, వెల్పేర్, ఇంజినీరింగ్ అసిస్టెంట్లుకు ఆదేశాలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం” పై క్షేత్ర స్థాయిలో సిబ్బంది చే జరపబడుతున్న సర్వే యొక్క ప్రోగ్రెస్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ ద్వారా 1983 నుంచి 2005 వరకు అర్హులైన లబ్దిదారులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేసిందన్నారు. ఇళ్లు నిర్మించుకొనే నిమిత్తం సంబందిత స్థల యజమానులు గృహనిర్మాణ సంస్థ లో వారికి అలాట్ చేసిన పట్టాను తాకట్టు పెట్టి అప్పుతీసుకొని తిరిగి చెల్లించని వారికి ప్రభుత్వం ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇందుకు సంబందించి విలేజ్ అసిస్టెంట్లు, పంచాయితీ సెక్రటరీలు, వాలెంటీర్లు ఇటువంటి ఇళ్లను గుర్తించి డిమాండ్ నోటీసులు అందించి వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్నేహలత, సచివాలయ సిబ్బంది, వైద్యాధికారి, వైద్య సిబ్బంది, వాలంటీర్లు మరియు ప్రజలు పాల్గొన్నారు.