విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బెంగుళూరు నందు 19th to 23rd OCTOBER-2021 జరిగిన 47th జూనియర్ & 37th సబ్ జూనియర్ నేషనల్స్ స్విమ్మింగ్ పోటిలలో ఆంధ్రప్రదేశ్ నుంచి స్విమింగ్ పోటిలకు పాల్గొన్న 58 మంది పిల్లలలో విజయవాడకు సంభందించి గాంధీనగర్ సర్ విజ్జి స్విమ్మింగ్ ఫూల్ నందు శిక్షణ పొందిన ముగ్గురు పిల్లలు పథకాలు సాధించినారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గార్లను మర్యాద పూర్వకంగా కలుసుకొన్నారు. ఈ సందర్బంలో వారు విజేతలుగా నిలిచిన చిన్నారులను అభినందిస్తూ, భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాదించి నగరానికి మణిహారంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంలో శిక్షణ కల్పించిన కోచ్ లను అభినందించినారు.
1. ఎన్.దేవా గణేష్ – (1.స్వర్ణ పతాకం, 2.కాంస్య పతాకం)
2. యమ్.యజ్ఞ సాయి – (2. స్వర్ణ పతాకం, 1.సిల్వర్ పతాకం)
3. కె. లాస్య సాయి – (3.స్వర్ణ పతాకం, 1.సిల్వర్ పతాకం, 1.కాంస్య పతాకం)
కార్యక్రమములో ఐ.రమేష్, సెక్రటరీ,K.D.A.A, కె.వి.వి.మోహన రాజా, జూ.అసిస్టెంట్, వి.యం.సి,(టీమ్ మేనేజర్ A.P), అప్పల నాయుడు, (A.P టీమ్ కోచ్) మరియు విద్యార్ధులు పాల్గొన్నారు.