విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ నందు వివిధ ఖాళీలను అవుట్ సోర్సింగ్ పద్దతిలో APCOS ద్వారా భర్తీ చేయుటకు ది.04.09.2021 తేదిన వార్తా పత్రికల నందు నోటిఫికేషన్ ప్రచురించడమైనది. సదరు ప్రక్రియలో భాగంగా ది.28.10.2021 మరియు 29.10.2021 తేదీలలో ఈ దిగువ తెలిపిన ప్రదేశాలలో ఇంటర్వ్యూ లు మరియు సర్టిఫికెట్స్ వెరిఫీకేషన్ నిర్వహించబడును.
1. గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ కొత్త బిల్డింగ్
2. ఐ.వి.ప్యాలస్ గవర్నర్ పేట మొదటి అంతస్తు.
3. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం (యోగా హాలు).
కావున కాల్ లెటర్స్ అందిన అభ్యర్ధులు తమకు తెలిపిన ప్రదేశాలలో మరియు వారికీ కేటాయించిన సమయమునకు కాల్ లెటర్ తో పాటు అడ్రస్ ద్రువీకరణ పత్రము మరియు అర్హత పత్రములతో ఇంటర్వ్యూనకు హాజరు కావలసినదిగా తెలియజేయడమైనది.