-యంపీడీవో గద్దే పుష్పరాణి
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లిబిడ్డల సంరక్షణకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రజల ఆరోగ్యవంతమైన జీవన విధానానికి అంగన్ వాడీ కేంద్రాల సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని యంపీడీవో గద్దే పుష్పరాణి అన్నారు. స్థానిక ఎన్జీవో హోమ్ లో మహిళాఅభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆమె ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లి బిడ్డలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ వారిని సంరక్షించే భాద్యతను అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తుదన్నారు.
ఐసీడీఎస్ పీవో సముద్రవేణి మాట్లాడుతూ 1996 లో మొదటిగా గుడివాడ, ఉయ్యూరు, మొవ్వ మండలాల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి నేటికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా నేడు సిల్వర్ జూబ్లీ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రామకృష్ణ, యంపీడీవో వెంకటరమణ ప్రసంగించగా, అంగన్ వాడీ సిబ్బంది, పలువురు గర్భణీ స్త్రీలు,బాలింతలు తదితరులు పాల్గొన్నారు.