-క్రైస్తవ ప్రార్థనల ఫిర్యాదు పై స్పందించని ఉన్నత అధికారులు
-పీ.హెచ్‌సీ.లో సిట్ విచారణ చేయాలి డాక్టర్ శాంతి ,అన్నామని పై చర్యలు తీసుకోవాలి- ఫిర్యాదు దారుడు కనకపూడి శ్రీను(అడ్వకేట్)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏలూరు జిల్లా ముదినేపల్లి (పీహెచ్‌సీ)లో మత ప్రచారం, మార్పిడులు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కనకపూడి శ్రీను అన్నారు.
గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణంలోనే రోగులను, సిబ్బందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రోగులను వదిలేసి ప్రార్థనలు చేయడం బాధాకరం అని అన్నారు.
న్యాయవాది శ్రీను తెలిపిన వివరాల ప్రకారం 2026 జనవరిలో వ్యక్తిగత పనిమీద కైకలూరు వెళ్తూ, బీపీ పరీక్ష కోసం ముదినేపల్లి పీహెచ్‌సీకి వెళ్లగా అక్కడ రోగులకు వైద్యం చేయకుండా గాలికొదిలేసి శుక్రవారం ఆసుపత్రిలో స్టాఫ్ అందరు కలిసి క్రైస్తవ ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు ఆయన గమనించారు. పీహెచ్‌సీలో పనిచేస్తున్న డాక్టర్ శాంతిశ్రీ, పీహెచ్‌ఎన్ అన్నమణి, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు కలిసి ఈ మత మార్పిడి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. వైద్యం కోసం వచ్చే హిందూ రోగులను ప్రలోభపెట్టి మత మార్పిడులు చేస్తున్నారని, ప్రార్థనలకు రాని హిందూ సిబ్బందిని కూడ వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారం అంతా ఫొటోలు, వీడియో సాక్ష్యాధారాలతో ఏలూరు జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓ సహా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మార్చి 26న దీనిపై నామమాత్రపు విచారణ మాత్రమే జరిగిందని, ఇప్పటివరకు బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 4, 5 సార్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కె. పద్మావతి కి విన్నవించినా ఫలితం లేదన్నారు.
పీహెచ్‌సీలో ప్రార్థనలు నిర్వహిస్తున్న సిబ్బంది పై చర్యలు తీసుకొని బాధ్యులైన డాక్టర్ శాంతి ,అన్నామని నీ తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యా,రోగ్య శాఖలో ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్ లకు పత్రికా ముఖంగా విన్నవించారు.
Prajavartha Online Telugu News