అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి సత్రాలు, అన్నదాన సత్రాలను ఆర్యవైశ్యులకే అప్పగించే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెల్పడంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హర్షాన్ని వ్యక్తంచేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి అభినందలు తెలిపారు. గురువారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారంటూ ఆనందాన్ని వ్యక్తంచేశారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆర్యవైశ్యుల దేవాలయాల నిర్వహణ విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చారని, అదే సాంప్రదాయాన్ని వారి తనయుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ ఆర్యవైశ్యుల సత్రాలు, అన్నదాన సత్రాలను దేవాదాయ శాఖ అన్ని సెక్షన్ల నుండి మినహాయింపు ఇస్తూ ఆర్యవైశ్యులకు పూర్తి స్వేచ్చనిచ్చారన్నారు. ఆర్యవైశ్యులు తమ సొంత నిధులతో నిర్మించుకున్న దేవాలయాలు, సత్రాల నిర్వహణ వారికే అప్పగించడం ఎంతో సమంజసం అన్నారు. అయితే వాటిని అమ్ముకునే అవకాశం మాత్రం ఆర్యవైశ్యులకు ఇవ్వలేదనే విషయాన్ని ఆయన స్పష్టంచేశారు.
హైందవ ధర్మాన్ని పరిరక్షించేందుకు మరియు కొనసాగించేందుకు నిరంతరం కృషిచేస్తున్న ధార్మిక సంస్థలకు, పీఠాలకు భూములు కేటాయించడం అనే విషయం ఎంతో అభినందనీయమన్నారు. వేధ, సంస్కృత పాఠశాలలను ఏర్పాటు చేసుకునేందుకు మరియు హైంధవ ధర్మాన్ని కొనిసాగించేందుకు ఆయా ధార్మిక సంస్థలు ఆ భూములు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. హైంధవ ధర్మాన్ని కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తమ వంతు సహకారాన్ని అందజేస్తుంటే, కొన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు ఈ విషయంపై దుష్ప్రచారం చేయడం ఎంతో సోచనీయం అన్నారు.
మంత్రితో పాటు విజయవాడ అర్బన్ జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధర రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …