Breaking News

పన్ను చెల్లింపులపై ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకునేందుకు రేపే చివరి అవకాశం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పన్ను చెల్లింపులపై ప్రభుత్వం కల్పించిన రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు రేపే చివరి అవకాశం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2025- 26 ఆర్థిక సంవత్సరమునకు ఉన్న పన్ను బకాయిలను ఏక మొత్తంలో చెల్లించి 50% వడ్డీ రాయితీని పొందవచ్చని అలాగే 2026- 27 ఆర్థిక సంవత్సరమునకు ముందస్తుగా ఇంటి పన్ను, ఖాళీ స్థల పన్ను చెల్లించి 5% రాయితీని పొందవచ్చని, ఈ అవకాశం ఏప్రిల్ 30, 2026 వరకు మాత్రమేనని, కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని, ప్రజల సౌకర్యార్థం పన్ను చెల్లింపులు కేంద్రాలు ఉదయం 8 గంటలనుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో కలవని కమిషనర్ అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *