Breaking News

అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్(UCF) కు బ్యాంకర్లు సహకరించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ కు బ్యాంకర్లు సహకరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కోరారు. మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో నగరంలోని బ్యాంకర్లందరితో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ లో భాగంగా నగరాభివృద్ధికి వచ్చే 15 సంవత్సరాలకు సరిపడా నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజ్ ప్రాజెక్ట్ ప్రణాళికలను ఇంజనీరింగ్ సిబ్బంది డి పి ఆర్ లు సిద్ధం చేయగా, దానికి ఖర్చయ్యే వ్యయం దాదాపు నీటి సరఫరాకు 319 కోట్లు మరియు భూగర్భ డ్రైనేజ్ కి 733 కోట్లు కాగా, అందులో 25% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని, మిగతా 25 % రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి బ్యాంకర్లందరూ కలిపి 50% సహకరించవలసిందిగా కమిషనర్ బాంకర్లను కోరారు. ఈ సమావేశంలో నగరంలోని వివిధ బ్యాంకుల మానేజర్లు, అకౌంట్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజ‌య‌వాడ ఆర్‌డీవోగా వెన్నెల శ్రీను

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ నూత‌న రెవెన్యూ డివిజనల్ అధికారిగా (ఆర్డీవో) వెన్నెల శ్రీను బుధవారం నగ‌రంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *