-వ్యవసాయం యజ్ఞం లాంటింది…
-అది ఫలసాయమే ఇవ్వడం కాదు..సంతృప్తినిస్తుంది…
-గిట్టుబాటు ఉన్న లేకపోయినా.ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతు మాత్రం వ్యవసాయం చేయడం మానడు…
-నలుగురికి కడుపునిపండమే రైతు పొందే ఆనందం..అలాంటి ఆనందం మరొకరు పొందలేరు…
-కరోనా వేళ ఆహారధాన్యాల ఉత్పత్తిలో రైతుల కృషి మరచిపోలేం…
-రైతులకు అండగా నిలిచేవారిని, మార్గదర్శనం చేసేవారు ఎప్పటికి అభినందనీయలు …
-భారత ఉప రాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా వేళ ఆహారధాన్యాల ఉత్పత్తిలో రైతుల కృషి మరచిపోలేమని ఉప రాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో శనివారం స్వర్ణభారత్ ట్రస్టు ఆవరణలో ఏర్పాటు చేసిన పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు రైతు నేస్తం పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముప్పవరపు ఫౌండేషన్, రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా 42 మంది రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, జర్నలిస్ట్ లు తదితరులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈసందర్భంగా యం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ జల సంరక్షణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాల్సిన అవసరముందన్నారు. వర్షపునీటి నిల్వకు ప్రతి రైతు పొలంలోనే గుంతలు తవ్వాలని సూచించారు. నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లకుండా చూడాలన్నారు.
మన దేశానికి అనాదిగా వ్యవసాయమే వెన్నెముక. సాగు ఖర్చులను రైతులు బాగా తగ్గించుకోవాలి. వ్యవసాయం అనేది ఎప్పుడూ పర్యావరణ హితంగా ఉండాలి. రసాయనాలు వచ్చాక భూమి, మనిషి ఆరోగ్యం చెడిపోయాయి. రైతులు క్రమంగా ప్రకృతి సేద్యంపై దృష్టి పెడుతున్నారు. రసాయనాలు వాడని పంటలకు మంచి ధర వస్తోంది. ప్రకృతి సాగు ద్వారా భూసారం పెంచుకుంటున్నారు. పొలం గట్లపై లాభాలిచ్చే వివిధ రకాల చెట్లు పెంచాలి’’ అని వెంకయ్యనాయుడు సూచించారు. ఈ సందర్భంగా ‘రైతు నేస్తం’ లాభసాటి వ్యవసాయ ఆధారిత పుస్తకాలను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.